GOLD SEIZED : ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 11 కోట్ల రూపాయల విలువైన 13.189 కేజీల బంగారం స్మగ్లింగ్ వ్యవహారాన్ని ఛేదించినట్లు.. కస్టమ్స్ కమిషనరేట్ కార్యాలయం వెల్లడించింది. నెల్లూరు, ఏలూరు, కాకినాడ, సూళ్లూరుపేట, చిలకలూరిపేటలో ఒకేసారి ఆపరేషన్ నిర్వహించినట్టు తెలిపింది. వంద మంది కస్టమ్స్ అధికారులు 20 బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించినట్లు వివరించింది. చెన్నై నుంచి సూళ్లూరుపేటకు బస్సులో వస్తున్న ఓ వ్యక్తి నుంచి 5 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. లెక్కల్లో చూపని 4.24 కోట్ల రూపాయల నగదు కూడా పట్టుకున్నట్టు కస్టమ్స్ విభాగం ప్రకటించింది. స్మగ్లింగ్ చేస్తున్న బంగారంపై విదేశీ కంపెనీల గుర్తులు ఉన్నట్టు తేల్చింది. స్మగ్లింగ్‌కు సంబంధించి నలుగురిని అరెస్టు చేసి, ఆర్థిక నేరాల కోర్టులో హాజరు పరిచినట్టు కస్టమ్స్ విభాగం తెలిపింది.
ఇవీ చదవండి: