ARREST: అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని.. అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బళ్లారి నుంచి భారీ మొత్తంలో కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. బళ్లారికి చెందిన విజయ్, రాము, కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన ఈశ్వరప్పతో కలిసి అక్రమ మద్యం వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. టాటా ఏస్ వాహనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరల్లో మద్యాన్ని తరలిస్తున్నారు. బళ్లారి నుంచి ఉరవకొండ మీదుగా డోన్‌కు మద్యం తరలిస్తుండగా.. ఉరవకొండ శివారు పాల్తూరు క్రాస్ వద్ద పోలీసులు తనిఖీ చేశారు. అక్రమంగా తరలిస్తున్న 3 వేల 744 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి.. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
ఏలూరు జిల్లా: చాట్రాయి మండలం పోతనపల్లి చిన్న తండా గ్రామాల్లో నాటు సారాయి తయారీ దారులపై నూజివీడు పోలీస్ మరియు సెబ్ అధికారులు దాడులు నిర్వహించారు. నాటు సారా తయారు చేయడానికి నిల్వ ఉంచిన సుమారు 2000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 10 లీటర్ల నాటుసారాను స్వాధీనపరచుకుని ఒకరిపై కేసు నమోదు చేసినట్లు నూజివీడు సీఐ తెలిపారు.
విశాఖ: కారులో బెంగళూరు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన గంజాయిని విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏడీసీపీ ఆనందరెడ్డి పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ త్రినాథరావు నేతృత్వంలోని పోలీసులు తనిఖీ చేశారు. కారులో దాచిన 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నగరంలోని నారాయణస్వామి లేఅవుట్‌కు చెందిన ఎం. కౌషిక్(25) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని.. కారు, చరవాణీని స్వాధీనం చేసుకుని రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇవీ చదవండి:కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఎప్పుడు?
- POLAVARAM: పోలవరం తొలి దశకు రూ.9,000 కోట్లు..అంచనాలు సిద్ధం చేసిన కేంద్రం
- రౌడీ హీరో రాజసం.. మిడిల్ క్లాస్ టు లగ్జరీ లైఫ్.. ఆస్తుల విలువ తెలిస్తే..