ETV Bharat / crime

పుట్టినరోజు నాడే విషాదం.. విద్యుత్​షాక్​తో ఇద్దరు యువరైతుల మృతి - పుట్టినరోజు నాడే విషాదం

YOUNG FARMERS DIED WITH ELCTRIC SHOCK : అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పొలం పనులకు వెళ్లిన ఇద్దరు యువ రైతులు విద్యుతాఘాతానికి గురై మృతి చెందారు. అందులో ఓ యువరైతుది నేడు పుట్టినరోజు. బర్త్​డే నాడు ఈ లోకాన్ని వదిలి వెళ్లడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

FARMERS DIED WITH ELCTRIC SHOCK
FARMERS DIED WITH ELCTRIC SHOCK
author img

By

Published : Oct 4, 2022, 4:45 PM IST

YOUNG FARMERS DIED : అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకేరోజు వేర్వేరు చోట్ల విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు యువ రైతులు మృతి చెందారు. ఉరవకొండ మండలం నింబగల్లులో పొలంలో మిరప పంటకు నీరు పెట్టడానికి వెళ్లిన మారుతి అనే రైతు.. మోటర్‌ ఆన్‌ చేయగా విద్యుత్‌ షాక్‌కు గురై కిందపడిపోయాడు. తోటి రైతులు కర్రలు, కండువాలతో యువకుడిని పక్కకు తీసి.. 108కి సమాచారం ఇచ్చారు. వారు అప్పటికే అతను చనిపోయినట్టు నిర్ధారించారు.

కూడేరు మండలం గొట్టుకూరులో పొలానికి వెళ్తుండగా కిందకు వేలాడుతున్న హైటెన్షన్‌ విద్యుత్‌ తీగ తగిలి కరుణాకర్‌ అనే మరో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. వైర్లు కిందకు వేలాడుతున్నాయని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవపోవడంతోనే కొడుకు ప్రాణాలు పోయాయంటూ.. స్థానిక రైతులు అనంతపురం, బళ్లారి జాతీయ రహదారిపై మృతదేహంతో బైఠాయించారు. రహదారిపై భారీగా రాకపోకలు నిలిచిపోయాయి. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పుట్టినరోజు నాడే కుమారుడు చనిపోవడంతో కరుణాకర్‌ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.