ETV Bharat / crime

ఈతరాక ఒకరు, కాపాడబోయి మరొకరు.. చెరువులో మునిగి మృతి - బోట్స్ క్లబ్ ఉద్యనవనం చెరువులో మునిగి ఇద్దరు మృతి

కాకినాడలోని సర్పవరంలో విషాదం చోటుచేసుకుంది. సర్పవరం బోట్స్ క్లబ్ ఉద్యానవనం చెరువులో మునిగి ఓ బాలుడి రక్షించబోయి... మరో వ్యక్తి మృతి చెందారు. బాలుడి ప్రాణాలు కాపాడేందుకు దిగి తన ప్రాణాలే పోగొట్టుకోవడం స్థానికులను కలచివేసింది.

Two persons died in sarpawaram  in kakinada

author img

By

Published : Mar 24, 2022, 5:27 AM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని సర్పవరంలో విషాదం చోటుచేసుకుంది. బోట్స్ క్లబ్ ఉద్యానవనం చెరువులో మునిగి ఓ బాలుడితో పాటు మరో వ్యక్తి మృతి చెందారు. పార్క్​లో చరణ్, చైతన్య అనే ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ఉండగా చెరువులో చెప్పు పడిపోయింది. తీసేందుకు ఇద్దరు చెరువులోకి దిగారు. లోతుగా ఉండటంతో ఈతరాక చిన్నారులు మునిగి పోయారు. వారిని పార్క్​కు తీసుకువచ్చిన భవానీ శంకర్ అనే వ్యక్తి పిల్లల్ని రక్షించేందుకు వెంటనే చెరువులోకి దూకాడు. చిన్నారులతో పాటు భవానీ శంకర్ మునిగిపోతుండడంతో స్థానికులు వాకర్స్ కర్ర అందించడతో... చరణ్​తో పాటు భవానీ శంకర్ ఒడ్డుకు వచ్చారు.

చైతన్య నీటిలో మునిగిపోతుండటంతో ఉద్యానవనాకి వచ్చిన చెందిన విశ్రాంత ఉద్యోగి మధుసూధనరావు నీటిలోకి దూకాడు. బాలుడ్ని రక్షించే క్రమంలో ఇద్దరు నీటిలో మునిగిపోయారు. ఘటనా స్థలానికి చెరుకుని మృతదేహాలను బయటకు తీశారు. బాలుడి ప్రాణాలు కాపాడేందుకు దిగి తన ప్రాణాలే పోగొట్టుకోవడం స్థానికులని కలచి వేసింది. గత ఐదు నెలల్లో ఐదుగురు ఈ చెరువులో ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: బతుకు బండిని లాగిన చక్రమే.. ప్రాణం తీసింది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.