ETV Bharat / crime

Tollywood Drugs Case: 6 గంటలపాటు నటి రకుల్​ప్రీత్ సింగ్​ విచారణ - రకుల్‌ప్రీత్‌ సింగ్​ను విచారించిన ఈడీ

తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారిన డ్రగ్​ కేసులో ఈడీ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నటి ఛార్మిని విచారించిన అధికారులు తాజాగా నటి రకుల్ ప్రీత్ సింగ్​ను ప్రశ్నించారు.

rakul
రకుల్ ప్రీత్ సింగ్​
author img

By

Published : Sep 3, 2021, 5:46 PM IST

Updated : Sep 3, 2021, 7:30 PM IST

తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారిన డ్రగ్​ కేసులో (Tollywood Drugs Case) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నటి ఛార్మిని సుదీర్ఘంగా విచారించిన ఈడీ(ED) అధికారులు.. ప్రముఖ నటి రకుల్‌ప్రీత్‌ సింగ్​ను (Rakul preet singh) ప్రశ్నించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ దాదాపు 6 గంటల పాటు సాగింది.

అందులో రకుల్​ పేరు లేదు

మనీ లాండరింగ్‌ కోణంలో రకుల్​ బ్యాంక్‌ ఖాతాలను ఈడీ అధికారులు పరిశీలించారు. అనుమానాస్పద లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారు. డ్రగ్​ కేసులో సిట్​ విచారణ పరంగానే ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. అయితే సిట్​ దర్యాప్తులో రకుల్​ ప్రీత్​ సింగ్ పేరు లేదు. ఎఫ్‌ క్లబ్‌ నుంచి డ్రగ్స్‌ సరఫరా అయినట్లు కెల్వీన్‌ ఇచ్చిన సమాచారంతో రకుల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.

మేనేజర్​ను ప్రశ్నించిన ఈడీ

2016లో ఎఫ్​ క్లబ్​లో నిర్వహించిన ఓ పార్టీలో రకుల్​ పాల్గొన్నారు. ఆ పార్టీలో కెల్విన్​ డ్రగ్ సరఫరా చేశాడు. ఈ క్రమంలో విదేశాలకు డబ్బును తరలించినట్లు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. కెల్విన్ నుంచి ప్రాథమికంగా సేకరించిన సమాచారం కోణంలోనే దర్యాప్తు కొనసాగింది. ఆ పార్టీలో రకుల్​ మేనేజర్​ కూడా పాల్గొనడంతో... ఆయన్ని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు.

మరోసారి హాజరు కావాలా?

రకుల్​ వ్యక్తిగత లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ముఖ్యంగా బ్యాంక్ ఖాతా వివరాలను పరిశీలించారు. దిల్లీ, ముంబయిలో ఉన్న రకుల్ ఖాతాల్లో జరిగిన లావాదేవీలు, యూపీఐ లావాదేవీలపై ప్రశ్నించారు. మత్తుమందు సరఫరాదారుడు కెల్విన్ తెలుసా అని ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నకు అతనెవరో తెలియదు రకుల్ సమాధానమిచ్చినట్లు సమాచారం.

మూడు రోజుల ముందుగానే

డ్రగ్స్‌ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఆరో తేదీన ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే షూటింగ్స్‌ ఉండటం వల్ల తాను హాజరుకాలేకపోతున్నానని.. గడువు ఇవ్వాలని ఈడీ అధికారులను రకుల్‌ కోరారు. అందుకు అంగీకరించని అధికారులు.. మూడు రోజుల ముందుగానే విచారణకు హాజరు కావాలని సూచించారు. ఇందులో భాగంగా ఆమె ముందుగానే ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈనెల 8న రానా ఈడీ విచారణకు రానున్నారు.

సంబంధిత కథనాలు:

Tollywood drugs case: సినీనటి ఛార్మిపై ఈడీ ప్రశ్నల వర్షం... కెల్విన్‌ సమాచారమే కీలకం!

Last Updated : Sep 3, 2021, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.