ETV Bharat / crime

AP CRIME NEWS: రాష్ట్రంలో పలు ప్రమాదాలు.. 13 మంది మృతి - ఏపీ నేర వార్తలు

AP CRIME NEWS: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పలు ప్రమాదాలు, ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కాటంవారిపల్లెలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని తల్లీ, బిడ్డ ఇద్దరు మృతి చెందారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంయలవర్తిపాడులో అప్పుల బాధ తట్టుకోలేక కౌలు రైతు బలవన్మరణం చేసుకున్నాడు.

ap crime news
ఆంధ్రప్రదేశ్ నేర వార్తలు
author img

By

Published : May 1, 2022, 12:26 PM IST

Updated : May 1, 2022, 3:29 PM IST

ప్రకాశం జిల్లా: కురిచేడు మండలం కాటంవారిపల్లెలో తల్లీ, బిడ్డ మృతి చెందారు. బిడ్డతో కలిసి పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

పల్నాడు జిల్లా: నకరికల్లు మండలం త్రిపురారంలో ట్రాక్టర్‌లో గడ్డివాము తరలిస్తుండగా విద్యుత్‌ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గడ్డివాముపై కూర్చున్న ఆత్మకూరి వెంకటేశ్వర్లు(37) అక్కడికక్కడే మృతి చెందాడు.

*పిడుగురాళ్లలోని తుమ్మలచెరువు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తెలంగాణ నుంచి వినుకొండకు తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని భారీ మొత్తంలో పట్టుకున్నారు. రెండు వేల మద్యం సీసాలను పట్టుకున్నట్లు సీఐ మధుసూదన్​రావు వెల్లడించారు.

గుంటూరు జిల్లా: మేడికొండూరు మండలం యలవర్తిపాడులో అప్పులబాధ తట్టుకోలేక కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. యారసాని షట్రక్ అనే రైతు పంట సాగులో నష్టం రావడంతో మనోవేదన గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

విశాఖ జిల్లా: అగనంపూడి వద్ద బైకును కంటెయినర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీహరిపురం వాసులు అడ్ల అప్పలస్వామి దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. అనకాపల్లిలోని నూకాలమ్మను దర్శించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

చిత్తూరు జిల్లా: కుప్పం మండలం లక్ష్మీపురంలో తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిపై కత్తితో ఓ కుమారుడు దాడిచేశాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది.

*శ్రీకాళహస్తిలోని తేదేపా నేతలపై రాళ్ల దాడి చేయడంతో తిరుపతి పార్లమెంటరీ తేదేపా అధ్యక్షులు నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం పాలక మండలి సభ్యులు జయశ్యామ్ అతని అనుచరులు రాళ్లు, కత్తులతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బాపట్ల జిల్లా: వేటపాలెం మండలం రామాపురంలో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లు, జేసీబీ స్వాధీనం చేసుకున్నారు.

*రేపల్లెలో ట్యూషన్ టీచర్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ట్యూషన్ టీచర్​పై పోక్సో కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ సూర్యనారాయణ తెలిపారు.

ఏలూరు జిల్లా: పెదపాడు మండలం కలపర్రు టోల్‌గేట్ వద్ద విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 200 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో బియ్యం తరలిస్తోన్న లారీని సీజ్ చేసి, అధికారులు కేసు నమోదు చేశారు.

పార్వతీపురం మన్యం జిల్లా: సాలూరు పట్టణం బంగారమ్మకాలనీలోని ఓ వ్యక్తి ఇంట్లోని ఫ్రిడ్జ్​లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు సంభవించాయి. ఈ ఘటనలో ఆస్తి మొత్తం అగ్నికి ఆహుతయ్యింది. సుమారు 4 లక్షల రూపాయల మేర ఆస్తినష్టం వాటిల్లిందని వారు వాపోతున్నారు.

కృష్ణా జిల్లా: పామర్రులో అనుమానాస్పద స్థితిలో ఇటుకల అమూల్య అనే వివాహిత మృతి చెందింది. అధిక కట్నం కోసం అల్లుడు ప్రసంగి బాబు తమ కుమార్తెను చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని యువతి తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పామర్రు పోలీసులు దర్యాప్తు చేపట్టామని, పరారీలో ఉన్న భర్త ప్రసంగి బాబును పట్టుకుంటామని తెలిపారు.

*నోట్లు మార్పిడి చేస్తున్న ఘటన కృష్ణా జిల్లా విస్సన్నపేటలో చోటుచేసుకుంది. నకిలీ నోట్ల వ్యవహారాలకు పాల్పడిన ఒకరిని అరెస్ట్ చేశామని , మరొకరిని అరెస్టు చేయాల్సి ఉందని మైలవరం ఏసీపీ ప్రసాద్ వెల్లడించారు.

* బందరు సబ్ డివిజన్​లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కృష్ణా జిల్లా పోలీస్, స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. పెడన మండలం ఈదుమూడి గ్రామంలో నాటు సారా స్థావరంపై దాడులు నిర్వహించి 250 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి, 40 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకొన్నారు.

గుంటూరు జిల్లా: ప్రశాంతి(03) అనే మూడు సంవత్సరాల చిన్నారి సీమ చింతకాయలు తిని మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా ఫిరంగీపురం మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*బంగారం అపహరించిన కేసులో ముద్దాయిని శనివారం ఫిరంగిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ముద్దాయి నుంచి ఎనిమిది లక్షలు విలువ చేసే సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పోతురాజు తెలిపారు. నిందితుడిని రిమాండ్​కు పంపంచినట్లు తెలిపారు.

నంద్యాల: జిల్లాలోని వార్డు సచివాలయ అడ్మిన్ సెక్రటరీ వెంకట సుధాకర్ పై ఓ వైకాపా కౌన్సిలర్ కుమారుడు చేయి చేసుకున్నాడు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ మనిజీర్ జిలాని సామున్ దృష్టికి తీసుకువచ్చారు. న్యాయం చేయాలని విన్నవించారు.

*డోన్​లో జరిగిన వివిధ చోరీకేసులో భాగంగా ఆరుగురిని అరెస్టు చేసినట్లు డోన్ పట్టణ సీఐ మల్లికార్జున తెలిపారు. వీరి నుంచి 10 తులాల బంగారు, 35 కిలోల వెండి, 20 వేల రూపాయల నగదు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని, కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ పేర్కొన్నారు.

ప్రకాశం జిల్లా: పిడుగు పాటుకు ఒక వ్యక్తి మృతి చెందగా, సుమారు 13 మేకలు మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం శతకోడు గ్రామంలో చోటుచేసుకుంది.

నెల్లూరు జిల్లా: అనంతసాగరం మండలం చిలకలమర్రి గ్రామంలో ఇటీవల కాలంలో భారీగా దొరికిన గోవా మద్యం కేసులో అన్వర్, వెంకటేశ్వర్లు అనే ఇద్దరిని సెబ్ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా ఇంకా పలువురికి సంబంధాలు ఉన్నాయని, వారికోసం గాలిస్తున్నట్లు సెబ్ అధికారులు తెలిపారు

అనకాపల్లి జిల్లా: నర్సీపట్నం సమీపంలోని సుబ్బారాయుడు పాలెం జీడి తోటల్లో వంటాకుల రమణ అనే యువకుడి హత్యా సంచలనం కలిగించింది. ఈ ఘటనపై నర్సీపట్నం గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* నక్కపల్లి మండలం గుల్లిపాడు రైల్వే స్టేషన్ పట్టాలపై అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు హత్యకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.

అనంతపురం జిల్లా: కళ్యాణదుర్గం మండలం మల్లాపురం గ్రామానికి చెందిన ఉపాధి కూలి మల్లికార్జున్​ పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. గమనించిన స్థానికులు కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

*పామిడి పట్టణం పెన్నానది రెండోకాలువ సమీపంలో మూడు ఎద్దుల బండ్లను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు త్రీవంగా గాయపడ్డారు. మృతి చెందిన వ్యక్తి పామిడి పట్టణానికి చెందిన అతనిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వైఎస్​ఆర్ జిల్లా: ఎస్పీ ఆదేశాల మేరకు చక్రాయపేట పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. కుప్పం తాండా సమీపంలో గల మద్దెలకోన అటవీ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి, 1000 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేసినట్లు సీఐ బాలమద్దిలేటి తెలిపారు.

ఇదీ చదవండి: Rape at Repalle: రేపల్లెలో దారుణం.. భర్తను కొట్టి భార్యపై సామూహిక అత్యాచారం

Last Updated : May 1, 2022, 3:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.