ETV Bharat / crime

Crime News: వేర్వేరు ఘటనలు.. ముగ్గురు మృతి

Crime News: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో పలు ప్రమాదాలు, ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. తిరుపతి జిల్లాలోని దాసరి మఠానికి చెందిన చంద్రన్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశాడు.

Crime News
రాష్ట్రంలో పలు ప్రమాదాలు
author img

By

Published : Apr 27, 2022, 9:42 AM IST

Updated : Apr 28, 2022, 2:53 AM IST

తిరుపతి జిల్లా: దాసరిమఠానికి చెందిన చంద్రన్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. అయితే తమ కుమారుడిని చెంచయ్య అనే వ్యక్తి చంపాడని మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుత్తూరులో చెంచయ్యను అదుపులోకి తీసుకుని తిరిగి వస్తుండగా.. వడమాలపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తిరుపతి తూర్పు పీఎస్‌ ఎస్‌ఐ గాయపడగా.. ఆస్పత్రికి తరలించారు.

* చంద్రగిరి మండలంలోని భాకరాపేట కనుమ దారిలో ఈరోజు ఉదయం లారీ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్​కి స్వల్ప గాయాలయ్యాయి. జరిగింది. లారీకి బ్రేక్ ఫెయిల్ అవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు లారీ డ్రైవర్ రఫీ తెలిపాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

* చెన్నై-కోల్​కతా జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కూల్​డ్రింక్స్ లారీ అదుపుతప్పి డివైడర్​ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్​కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు అంబులెన్స్ సాయంతో డ్రైవర్​ని ఆసుపత్రికి తరలించారు.

నెల్లూరు జిల్లా: కందుకూరులోని విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఉన్న సామగ్రి చోరీకీ గురైంది. కార్యాలయ తాళాలు పగలగొట్టి దొంగిలించిన సామాన్లను వాహనంలో తరలించారు. సామాగ్రి చోరీ ఘటనపై కార్యాలయం వద్ద యూటీఎఫ్ నాయకుల ఆందోళన చేపట్టారు.

ఎన్టీఆర్‌ జిల్లా: పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. లారీని మార్నింగ్ ట్రావెల్స్‌ ప్రైవేట్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందగా, పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రలను నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* విజయవాడ సిద్ధార్థ కాలేజీలో ప్రాజెక్ట్ వర్క్ ముగించుకొని మచిలీపట్నంకు స్కూటీలపై విద్యార్థులు తిరిగి వస్తుండగా కంకిపాడు మండలం దావులూరు టోల్ గేట్ సమీపంలో ప్రమాదం జరిగింది. అడ్డదారి నుండి ధాన్యం బస్తాలతో నుండి వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో సుజ శ్రీ (20) మృతి చెందింది. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.

అనంతపురం జిల్లా: మద్యం మత్తులో కారు బీభత్సం సృష్టించిన ఘటన అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో చోటుచేసుకుంది. కర్నూల్ నుంచి గుంతకల్లు వెళ్తున్న కారు గుత్తి పట్టణంలోని శాంతి ప్రియ హాస్పిటల్ సమీపంలోకి రాగానే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ఎదురుగా ఉన్న 11 కె.వి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

* ప్రయాణ ప్రాంగణాలు, రద్దీ ప్రదేశాల్లో చరవాణులను దొంగలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఉరవకొండ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఆ ముగ్గురి నుంచి మొత్తం రూ.8 లక్షలు విలువైన 82 చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్సీ నర్సింగప్ప వెల్లడించారు. వారిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.

* ఉరవకొండ పరిసరాల్లో మట్కాను ఆడిస్తున్న బీటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.26 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉరవకొండ మండలం చిన్నమష్టూరుకు చెందిన ఆదినారాయణ, శ్రీనివాసులు, ఆంజనేయులు, నాగరాజు, వన్నప్ప మట్కా ఆడి గెలిచిన వారికి రూ.1కి రూ.80 ఇస్తామంటూ ఆశజూపి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని డీఎస్పీ వెల్లడించారు.

పల్నాడు జిల్లా: కారంపూడి మండలంలోని పాత సినిమా హాల్ సెంటర్ నందు తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో కారంపూడి నుండి నరసరావుపేట రోడ్డులో ఉన్న నూతలపాటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అతని కట్టెల అడ్తి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధం అయింది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

విశాఖ జిల్లా: గాజువాక-మింది రహదారిలోని చెత్త దుకాణంలో మంటలు చెలరేగడంతో ప్రక్కనున్న 2 ట్రాన్స్‌ఫార్మర్లకు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న ఘటనాస్థలికి చేరుకున్నారు.

కడప జిల్లా: కడపలో రెండు కాలనీల్లో ఇద్దరు వ్యాపారుల ఇళ్లల్లో భారీ చోరీ జరిగింది. సింహపురి, గంజికుంట కాలనీలోని రెండు ఇళ్లల్లో పట్టపగలే చోరీ జరిగింది. ఓ ఓ వ్యాపారి ఇంట్లో 40 తులాల బంగారం , మరొకరి ఇంట్లో 4 కిలోల వెండి 10 తులాల బంగారం, రూ.1.20 లక్షలు చోరీ బాధితులు తెలిపారు. ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు దొంగలు కారం పొడి చల్లినట్లు తెలిపారు. చోరీపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అల్లూరి జిల్లా : అనంతగిరి ఘాట్‌రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తా పడిన ఘటనలో ఎగువశభ గ్రామ సచివాలయం మహిళా పోలీసు మృతి చెందింది.

బాపట్ల జిల్లా: కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలో వివాహిత హత్యకు గురైంది. వ్యసాయ పనులకు వెళ్లిన రూపశ్రీని ప్రవీణ్ అనే వ్యక్తి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.5 ఏళ్ల క్రితం భర్తను కోల్పోయిన రూపశ్రీ పుట్టింటిలోనే తల్లిదండ్రులతో కలిసి ఉంటుందన్నారు. తెనాలి మండలం నేలపాడు గ్రామానికి చెందిన ప్రవీణ్ తో రూపశ్రీకి సంబంధం ఏర్పడిందని....పొలంలో ఇద్దరి మధ్య తలెత్తిన ఘర్షణ హత్యకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: OIL: మార్కెట్‌ ధర కంటే తక్కువకే.. ఆ వంటనూనె

Last Updated : Apr 28, 2022, 2:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.