ETV Bharat / crime

AP Crime News: రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాలు.. ఎనిమిది మంది మృతి

author img

By

Published : Apr 12, 2022, 2:08 PM IST

Updated : Apr 12, 2022, 8:51 PM IST

AP Crime News: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పలు ప్రమాదాలు, ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో నలుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి.

AP Crime News
రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాలు.. ఎనిమిది మంది మృతి

కరెంట్ స్థంభానికి ఢీకొన్న బైక్ -భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్న ముష్టురు వద్ద ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయిన ద్విచక్రవాహనం కరెంట్ స్థంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న భర్త వెంకటేశులు మృతి చెందగా అతని భార్య గురుపాదమ్మకు తీవ్ర గాయాలయ్యాయి.108 వాహనం రావడం ఆలస్యమవడంతో గాయపడిన మహిళను పోలీస్ జీపులోనే ఆసుపత్రికి తరలించారు.

రైల్వే ట్రాక్ పై మృతదేహాలు.. ఆరా తీస్తున్న పోలీసులు: అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నరసింగబిల్లి రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని రైలు నుంచి జారిపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులు రాజమండ్రి ధవళేశ్వరానికి చెందిన బావ బామ్మర్దులు వేగి మూర్తి (40), భీశెట్టి శ్రీను(40)గా గుర్తించారు. వీరిరువురూ విశాఖపట్నంలో కూలి పని చేసుకోవడానికి రైల్లో వస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు తుని రైల్వే పోలీసులు గుర్తించారు. అయితే ఏ రైలు నుంచి జారిపడ్డారన్న వివరాలను ఆరా తీస్తున్నారు. మృతదేహాలను తుని ఆస్పత్రికి తరలించి విచారణ చేపడుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

కదులుతున్న బస్సు నుంచి దిగేందుకు యత్నించి..చివరికి..: గుంటూరు జిల్లా తెనాలిలో ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థి కదులుతున్న బస్సులోంచి కిందకు దిగా యత్నం చేశాడు. అంతోలేనే కాలుజారి కింద పడటంతో జగదీష్ చెయ్యి పై బస్సు వెనుక చక్రాల కిందపడి నుజ్జు నుజ్జయ్యాయి. గమనించిన డ్రైవర్ బస్సు అక్కడే ఆపివేశాడు. స్థానికులు జగదీష్ ను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితి లేకపోయినా చెయ్యి తొలగించే పరిస్థితి ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై మూడవ పట్టణ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎమ్మార్వో కార్యాలయంలో విశ్రాంత తహసీల్దార్ ఆత్మహత్య: అనారోగ్య కారణాలతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో విశ్రాంత తహసీల్దార్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. హిందూపురానికి చెందిన రాజశేఖర్ శెట్టి(70) కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తహసీల్దార్ కార్యాలయంలోకి ఈ చర్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న హిందూపురం టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: గురుకుల పాఠశాలలో ఫుడ్​ పాయిజన్​.. 10మంది విద్యార్థినులకు అస్వస్థత

చోరీలకు పాల్పడుతున్న దంపతుల అరెస్ట్: ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తోటమూల గ్రామంలోని ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.13 లక్షల విలువ చేసే బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు ఏసీపీ మీడియాకు తెలిపారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి: కృష్ణా జిల్లా పెనమలూరులోని కంకిపాడు పరిధిలోని జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మేట శీను అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కంకిపాడు ఎస్సై దుర్గారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్టీసీ బస్సు, బైకు ఢీ.. ఒకరు మృతి: బాపట్ల పట్టణంలోని మూర్తి నగర్ వద్ద ఆర్టీసీ బస్సు, బైకు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఉపసభాపతి కోన రఘుపతి ఘటనా స్థలానికి చేరుకుని మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.

విద్యుదాఘాతంతో వృద్ధ దంపతులు మృతి: విజయనగరంలోని వైఎస్‌ఆర్‌ కాలనీలో విద్యుదాఘాతంతో వృద్ధ దంపతులు మృతి చెందారు.

విష గుళికలు తిని ..: పంటల సాగులో వినియోగించే విష గుళికలు తిని చిన్నారి(2) మృతి చెందింది. ఈ ఘటన తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం బత్తినయ్య ఎస్టీ కాలనీలో జరిగింది.

ఐదెకరాల జీడి తోటలు దగ్ధం : శ్రీకాకుళం జిల్లా పిడిమందస ప్రాంతంలోని నలుగురు రైతులకు చెందిన ఐదెకరాల జీడి తోటలు దగ్ధం అయ్యాయి. ఎవరో సిగరెట్ కాల్చి ఆర్పకుండా పడేసుంటారని, అందువల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్: తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్న సోమేశ్వరరావు అనే యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 19 వాహనాలను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి తెలిపారు.

రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య: కర్నూలు జిల్లా ఆదోనిలో రైలు కిందపడి వెంకటేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వేట్రాక్​పై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.

లారీ, బైకు ఢీ.. వ్యక్తి మృతి: కర్నూలు జిల్లాలో లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో నరసాపురం గ్రామానికి చెందిన ప్రభుదాస్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పరిధిలో గంజాయి కలిగి ఉన్న ముగ్గురు యువకులను పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు పట్టణ ఎస్సై వీరబాబు తెలిపారు.

వ్యాను బోల్తా.. 15 మందికి గాయాలు: పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం జామితోట వాగులో వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. జియ్యమ్మవలస నుంచి మందసలో జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఇదీ చదవండి: Old Women Died: వృద్ధురాలి ప్రాణం తీసిన చిన్న వివాదం.. వైకాపా నాయకులే కారణం!

Last Updated : Apr 12, 2022, 8:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.