ETV Bharat / crime

లాయర్ దంపతుల హత్య కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్ - కరీంనగర్ తాజా వార్తలు

హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యకేసులో నిందితులకు మంథని న్యాయస్థానం 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. నిందితులను రాత్రి 11.03గంటలకు పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను పాత్రపై ఇంకా విచారణ సాగుతోంది.

లాయర్ దంపతుల హత్య కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్

author img

By

Published : Feb 20, 2021, 6:38 AM IST

న్యాయవాద దంపతులను హత్య చేసిన ముగ్గురిని మంథని న్యాయస్థానం జుడీషియల్ రిమాండ్ విధించింది. వీరికి ఆయుధాలు, వాహనం సమకూర్చిన బిట్టు శ్రీను మాత్రం ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ముగ్గురు నిందితులను మంథని సీనియర్ సివిల్ జడ్జి ఎదుట కోర్టులో రాత్రి 11.03గంటలకు పోలీసులు హాజరుపరిచారు.

సీన్ రీకన్స్​ట్రక్షన్ అనంతరం..

గట్టు వామనరావు, నాగమణిల హత్య కేసులో ఏ-1 కుంట శ్రీనివాస్, ఏ-2 చిరంజీవిలను మహారాష్ట్ర సరిహద్దులో, ఏ-3గా ఉన్న అక్కపాక కుమార్​ను మంథనిలో పోలీసులు అరెస్టు చేశారు. కేసుపై 24 గంటల విచారించిన పోలీసులు... హత్య జరిగిన స్థలానికి తీసుకెళ్లి సీన్​ రీకన్స్​ట్రక్షన్ చేశారు. అనంతరం ముగ్గురు నిందితులకు గోదావరిఖనిలో కరోనా, ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్​..

పోలీసు బందోబస్తు నడుమ నిందితులు ముగ్గురిని మంథని జూనియర్ జడ్జి నాగేశ్వరరావు ఎదుట హాజరుపరచారు. ముగ్గురికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్​కు తరలిస్తూ జడ్జి ఆదేశించారు. నిందితులను కరీంనగర్ జైలుకు తరలించి అక్కడి నుంచి వరంగల్ జిల్లాకు తరలించే అవకాశం ఉంది.

కొనసాగుతున్న విచారణ..

నాటకీయ పరిణామాల మధ్య ముగ్గురిని కోర్టులో హాజరు పరిచినప్పటికీ జడ్పీ ఛైర్ ​పర్సన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను పాత్రపై ఇంకా విచారణ సాగుతోంది. కొబ్బరి బొండాలు నరికే కొడవళ్లు ఎక్కడి నుంచి సమకూర్చారో ఇంకా తేలాల్సి ఉంది.

ఇవీ చూడండి

: న్యాయవాద దంపతుల హత్య కేసులో రోజుకో మలుపు... పుట్టలో ఇంకెందరో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.