ETV Bharat / crime

Tourist Articles Theft: వంజంగిలో దొంగల బీభత్సం.. కారు అద్దాలు పగలగొట్టి.. - ap news

Tourist Articles Theft at Vanjangi: విశాఖ జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రం వంజంగిలో కారు అద్దాలు పగులగొట్టి దొంగలు దోచుకున్నారు. పార్కింగ్ చేసిన పర్యాటకుల కారు అద్దాలు పగలగొట్టి చోరీ చేశారు

thieves at vishaka distrcit
వంజంగిలో దొంగల బీభత్సం
author img

By

Published : Dec 30, 2021, 12:59 PM IST

విశాఖ జిల్లా పాడేరు మండలం వంజంగిలో దొంగల బీభత్సం సృష్టించారు. పార్కింగ్ చేసిన పర్యాటకుల కారు అద్దాలు పగలగొట్టి చోరీ చేశారు. అర్ధరాత్రి ఎలమంచిలి నుంచి రెండు కార్లలో 10 మంది పర్యాటకులు వచ్చారు. కారు పార్క్ చేసుకుని అర్ధరాత్రి 2 గంటల సమయంలో కొండపైకి వెళ్లారు. ఈ సమయంలో దొంగలు కారు అద్దాలు పగలకొట్టి కారులో ఉన్న రెండు బ్యాగులు చోరీ చేశారు. వీటిలో 2 సెల్​ఫోన్లు. ముప్పావు తులం బంగారం, మూడు వేల నగదు, ఏటీఎం, ఆధార్ కార్డులు ఉన్నాయని బాధితులు తెలిపారు . చోరీ ఘటనపై పర్యాటకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:

Cinema Theaters Open: సీజ్​ చేసిన థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.