ETV Bharat / crime

తాళాలు పగల గొట్టి.. రెండు ఇళ్లలో చోరీ

తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోతున్నారు. తెలంగాణ మంచిర్యాల జిల్లా మందమర్రిలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. పక్కపక్కనే ఉన్న ఇళ్లలో దొంగతనం చేసి బంగారు, నగదు ఎత్తుకెళ్లారు.

theft in two houses in mandhamarri in macherial district
తాళాలు పగలగొట్టి రెండిళ్లలో చోరీకి పాల్పడిన దుండగులు
author img

By

Published : Mar 3, 2021, 10:56 AM IST

రెండిళ్లలో చోరీకి పాల్పడిన దుండగులు బంగారు, నగదు దోచుకెళ్లారు. తెలంగాణ మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాంధీనగర్ కాంట్రాక్ట్​ బస్తీలోని పక్కపక్కనే ఉన్న ఇళ్లలో చోరీ జరిగింది.

ఎలక్ట్రీషియన్​గా పనిచేస్తున్న చింతల శ్రీనివాస్​ ఇంట్లో రెండు తులాల బంగారం, 13 వేల రూపాయల నగదు అపహరించారు. అదే బస్తీలో నివాసముండే నేర్వట్ల రాజలింగు ఇంటికి ఉన్న ప్రహారీ గోడ దూకి తాళాలు పగలగొట్టి నాలుగు తులాల బంగారం, 52 వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్​ టీమ్​ను రంగంలోకి దింపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇదీ చదవండి:

పురపాలక ఎన్నికలకు తొలగిన న్యాయపరమైన అవరోధాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.