ETV Bharat / crime

Shilpa Chowdary Cheating Case : శిల్పాచౌదరి చేతిలో మోసపోయిన హీరో మహేశ్​బాబు సోదరి - శిల్పాచౌదరి చీటింగ్ కేసు న్యూస్

అమాయకులకు మాయమాటలు చెప్పి వారి నుంచి కోట్ల రూపాయలు దోచేసిన శిల్పాచౌదరి చేతిలో మోసపోయిన వారిలో 90 మంది సెలబ్రిటీ కుటుంబాల మహిళలున్నారని పోలీసులు గుర్తించారు. శిల్ప తన వద్ద నుంచి రూ.2 కోట్లకుపైగా డబ్బు తీసుకుని మోసం చేసిందంటూ హీరో మహేశ్​బాబు సోదరి ప్రియదర్శిని తమకు ఫిర్యాదు చేసినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.

Shilpa Chowdary Cheating Case
Shilpa Chowdary Cheating Case
author img

By

Published : Dec 2, 2021, 10:30 AM IST

Shilpa Chowdary Cheating Case : మహిళలకు మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి రూ.కోట్లు కాజేసిన శిల్పాచౌదరి మోసాల్లో మరో కోణాన్ని పోలీసులు తెలుసుకున్నారు. దివానోస్‌ పేరుతో జూదశాలను నిర్వహించిందని సాక్ష్యాధారాలు సేకరించారు. ఇందులో 90 మంది సెలబ్రిటీల కుటుంబాల మహిళలున్నారని గుర్తించారు. శిల్పా చౌదరి జైల్లో ఉందని తెలుసుకున్న ఆమె బాధితులు తమ వద్ద కూడా రూ.కోట్లలో నగదు తీసుకుని మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

Shilpa Chowdary Case Updates : గండిపేటలోని సిగ్నేచర్‌ విల్లాలో పదేళ్లుగా నివాసముంటున్న శిల్పాచౌదరి, శ్రీకృష్ణ శ్రీనివాస్‌ ప్రసాద్‌ దంపతులు తమకు తాము ధనవంతులుగా ప్రకటించుకున్నారు. టీవీ, సినీ నిర్మాతగా పరిచయం చేసుకున్న శిల్పాచౌదరి సినీప్రముఖుల కుటుంబాల్లోని మహిళలను తరచూ కలుసుకుంటూ వారాంతాల్లో పార్టీల పేరుతో ఆహ్వానించేది. తొలుత కొంతమందితో మొదలైన కిట్టీ పార్టీలను తర్వాత జూదంగా మార్చింది. దివానోస్‌ పేరుతో జూదశాలను ప్రారంభించింది. సంపన్న కుటుంబాలకు చెందిన మహిళల్లో 90 మందిని సభ్యులుగా చేర్పించుకుంది. వారాంతాల్లో విందులు, వినోదాలు ఏర్పాటు చేసేది.

Shilpa Chowdary Case News : శిల్పాచౌదరి భర్త శ్రీకృష్ణ శ్రీనివాస్‌ ప్రసాద్‌ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడన్న సమాచారంతో ఎక్కడెక్కడ భూములు కొన్నారన్న వివరాలను సేకరిస్తున్నారు. హీరో మహేశ్‌బాబు సోదరి ప్రియదర్శిని తన వద్ద నుంచి రూ. 2 కోట్లకు పైగా నగదు తీసుకుని శిల్పాచౌదరి మోసం చేసిందంటూ కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని నార్సింగి పోలీసులు తెలిపారు. శిల్పాచౌదరిని నార్సింగి పోలీసులు 7 రోజుల కస్టడీకి కోరారు. శిల్పాచౌదరి కస్టడీ పిటిషన్‌పై నేడు ఉప్పరపల్లి కోర్టులో విచారణ జరగనుంది.

ఇవీ చదవండి :

Shilpa Chaudhary case: అధిక వడ్డీ ఇస్తానంటూ కోట్ల రూపాయలు మోసాలకు పాల్పడిన శిల్పాచౌదరి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తన వద్ద 2.4 కోట్లు తీసుకుని మోసం చేసిందని నార్సింగి ఠాణాలో మరో మహిళ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది అధిక వడ్డీ ఇస్తానని డబ్బు తీసుకుందని... ఇవ్వకుండా మోసం చేసిందని బాధితురాలి ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పటివరకూ నార్సింగి పీఎస్​లోనే శిల్పా చౌదరిపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Shilpa fraud: మోసం చేయడమే ఆమె లక్ష్యం. భార్య చేసే మోసాలకు వత్తాసు పలకడమే భర్త లక్షణం. అధిక వడ్డీలు, వ్యాపారాల్లో లాభాల పేరిట వల వేసి.. వారి నుంచి కోట్లలో డబ్బులు తీసుకుని.. విలాసవంతమైన జీవితాన్ని గడపడమే ఆ దంపతుల ధ్యేయం. అలా మోసాలకు పాల్పడిన శిల్పా చౌదరి (Shilpa fraud) గుట్టు ఎట్టకేలకు బయటపడింది. హైదరాబాద్​కు చెందిన వ్యాపారవేత్త శిల్పను, ఆమె భర్త శ్రీనివాస్​ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. కోటి 5లక్షల రూపాయల తీసుకొని తిరిగి ఇవ్వలేదని దివ్య అనే మహిళ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.