Son murdered Her Father: కన్న కొడుకే తండ్రి పాలిట యముడయ్యాడు. చిన్ననాటి నుంచి పెంచి పెద్ద వాడిని చేస్తే.. చివరికి తండ్రి ప్రాణాలనే తీశాడు. లారీతో ఢీకొట్టి కన్న తండ్రినే హతమార్చిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రి నుంచి మహబూబ్ బాషా అనే వ్యక్తి, అతని కుమారుడు, మరో వ్యక్తితో కలిసి సిమెంట్ లోడు లారీలో నెల్లూరుకు బయల్దేరారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం రాజుపాలెం వద్దకు రాగానే మహబూబ్ బాషాను అతని కుమారుడు.. అదే లారీతో ఢీకొట్టాడు. తీవ్రగాయాలైన తండ్రి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పొయాడు.
మృతదేహాన్ని అక్కడే వదిలి లారీతో సహా కుమారుడు పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తండ్రి కొడుకులతో సహా లారీలో వచ్చిన మరో వ్యక్తి జరిగిన ఘటన పోలీసులకు తెలిపాడు. కుమారుడే తండ్రిని హతమార్చినట్లు పోలీసులకు వివరించాడు. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతిపై పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి :