ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలిస్తున్న 30 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి కాజా టోల్ గేట్ వద్ద అనుమానంగా కనిపించిన లారీని పోలీసులు తనిఖీ చేయగా అందులో రేషన్ బియ్యాన్ని గుర్తించారు. లారీలో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి: