ETV Bharat / crime

దెందులూరు వద్ద జాతీయ రహదారిపై దారి దోపిడీ... రూ.50 వేలు అపహరణ

author img

By

Published : Feb 11, 2022, 10:36 AM IST

Robbery at Denduluru: దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద దుండగులు దారి దోపిడీకి పాల్పడ్డారు. ఓ లారీ డ్రైవర్​పై కత్తితో దాడిచేసి.. అతడి దగ్గరున్న రూ.50,750 నగదు ఎత్తుకెళ్లారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన డ్రైవర్​ను ఆస్పత్రికి తరలించారు.

Robbery
దారి దోపిడీ

Robbery at Denduluru: కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం కాటూరుకు చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తి పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో చేపలు లారీలో లోడ్ చేసుకున్నాడు. అక్కడి నుంచి హనుమాన్ జంక్షన్​లో మరో డ్రైవర్​కు అప్పగించడానికి బయలుదేరాడు. దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం బొలెరో వాహనంలో వచ్చిన కొందరు దుండగులు కారును లారీకి అడ్డంగా నిలిపారు. లారీ డ్రైవర్​పై కత్తితో దాడి చేశారు. అతడి వద్ద ఉన్న రూ.50,750 నగదు తీసుకుని పరారయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడిన లారీ డ్రైవర్​ను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

సాధారణ తనిఖీల్లో అసలు విషయం బయటకు.. పోలీసుల షాక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.