ETV Bharat / crime

ACCIDENT: రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాలు.. ఐదుగురు మృతి - ఆంధ్రప్రదేశ్ నేర వార్తలు

ACCIDENT
ACCIDENT
author img

By

Published : Jun 16, 2022, 9:00 AM IST

Updated : Jun 16, 2022, 10:37 AM IST

08:53 June 16

ప్రత్తిపాడు మండలంలో రెండు ఘటనలు

రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాలు.. ఐదుగురు మృతి

ACCIDENT: గుంటూరు జిల్లాలో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. ప్రత్తిపాడు మండలం యనమదల వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మరణించాడు. ప్రమాద విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తుండగా సంగం డెయిరీకి చెందిన పాల వ్యాన్ వేగంగా దూసుకొచ్చింది. ఈ ఘటనలో హోంగార్డుతో పాటు లారీ యజమాని మరణించాడు. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని గుంటూరు జీజీహెచ్​కు తరలించారు.

నంద్యాల: రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లా పాణ్యం నియెజకవర్గంలో చోటుచేసుకుంది. కడపజిల్లా చిట్వేలుకు చెందిన పి.సుబ్బారామరాజు కుటుంబ సభ్యులు కారులో హైదరాబాద్​కు వెళ్తుండగా.. పాణ్యం మండలం తమ్మరాజుపల్లి అడ్డవాగు వద్దనున్న కల్వర్టును కారు ఢీకొట్టింది. ఈప్రమాదంలో కారు బోల్తాపడి సుబ్బారామరాజు (60), అతని కుమారుడు కుమార్ రాజు(37) అక్కడికక్కడే మృతిచెందారు. సుబ్బారామరాజు మరోకుమారుడు, బంధువుల అబ్బాయి గాయపడ్డారు. హైదరాబాద్​కు చికిత్స కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై పాణ్యం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 16, 2022, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.