ETV Bharat / crime

red sandal case: జిల్లాలు దాటించి.. గుంతలో దాచేసి..!

తీగ లాగారు... డొంక కదిలింది. తిరుపతిలో పట్టుబడిన ఓ స్మగ్లర్‌ ఇచ్చిన సమాచారంతో చిత్తూరు జిల్లా ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ పోలీస్‌ బృందం... ప్రకాశం జిల్లాలో పెద్ద సంఖ్యలో దుంగలను స్వాధీనం చేసుకుంది.

red sandel blocks found in under ground at prakasham district

author img

By

Published : Jul 31, 2021, 12:02 PM IST

గుంతలో ఎర్రచందనం దుంగలు

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల చినారిగట్లలో పొలంలో పాతిపెట్టి ఉంచిన ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఓ స్మగ్లర్‌ను అదుపులో తీసుకుని విచారించగా.. ప్రకాశం జిల్లాలో పాతిపెట్టి ఉంచిన ఎర్రచందనం దుంగల సమాచారం ఇచ్చాడు. కొనకనమిట్ల మండలంలోని చినారికట్ల గ్రామానికి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం రాత్రి ఆ ప్రాంతానికి చేరుకున్నారు.

వెంకటరెడ్డి అనే వ్యక్తికి చెందిన వ్యవసాయ పొలంలో మూడు అడుగుల లోతున గుంత తీసి భద్రపరిచిన దాదాపు 40 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని వెంకటరెడ్డితో పాటు ఓ జేసీబీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై స్థానిక పోలీసుల వివరణ కోరగా తమకు సమాచారం లేదన్నారు. ఇక్కడికి దుంగలను ఎవరు ఎక్కడినుంచి తీసుకువచ్చారు? దీని వెనుక ఎంతమంది సూత్రధారులు ఉన్నారనే విషయం తేలాల్సి ఉంది.

ఇదీ చదవండి:

krishna water: 'కృష్ణా జలాల్లో చెరి సగం వాటా.. అర్థరహితం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.