ETV Bharat / crime

Human Trafficking Cases in Telangana : బీ అలర్ట్.. లైంగిక అక్రమ రవాణాలో మొదటిస్థానంలో తెలంగాణ!

ఉద్యోగాల పేరిట యువతులకు వల వేస్తున్నారు. నెమ్మదిగా నమ్మించి.. మభ్యపెట్టి వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెడుతున్నారు. 2020లో లైంగిక అక్రమ రవాణా కేసుల నమోదులో దేశంలోనే తెలంగాణ తొలిస్థానంలో నిలిచింది. ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇటీవలే జిల్లాకొకటి చొప్పున మానవ అక్రమ రవాణా నిరోధక బృందాలను ఏర్పాటు చేసింది. కానీ.. నిందితులకు శిక్షలు వేయించడంలో మాత్రం తెలంగాణ పోలీసులు వైఫల్యాన్ని చవిచూస్తున్నారు.

author img

By

Published : Oct 17, 2021, 6:09 PM IST

Human Trafficking Cases in Telangana
లైంగిక అక్రమ రవాణాలో మొదటిస్థానంలో తెలంగాణ!

తెలంగాణ రాష్ట్రంలో లైంగిక అక్రమ రవాణా కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2020లో ఈ తరహా కేసుల నమోదులో దేశంలోనే తెలంగాణ తొలిస్థానంలో నిలవడం గమనార్హం. ముఖ్యంగా యువతుల్ని ఉద్యోగాల పేరిట మభ్యపెట్టి తీసుకొస్తున్న ముఠాలు.. అనంతరం వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెడుతున్నట్లు జాతీయ నేర నమోదు సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. విదేశాలపరంగా చూస్తే బంగ్లాదేశ్‌ నుంచి ఎక్కువమంది యువతుల్ని తీసుకొస్తున్నారు. పశ్చిమబెంగాల్‌తోపాటు త్రిపుర, అసోం తదితర రాష్ట్రాల సరిహద్దులోకి అక్రమంగా తీసుకొస్తూ.. అక్కడి నుంచి రైళ్లు, విమానాల్లో హైదరాబాద్‌ సహా ఇతర మెట్రోనగరాలకు తరలిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడవుతోంది. ఈ తరహా కేసుల్లో దర్యాప్తు బృందాలు బాధితురాళ్లకు విముక్తి కలిగేలా చేస్తున్నాయి. ఇటీవలే జిల్లాకొకటి చొప్పున ఏర్పాటు చేసిన మానవ అక్రమ రవాణా నిరోధక బృందాలు ఇందుకు సహకరిస్తున్నాయి. అయితే నిందితులకు శిక్షలు వేయించడంలో మాత్రం పోలీసులు వైఫల్యాన్ని చవిచూస్తున్నారు.

తెలంగాణ.. మహారాష్ట్ర.. ఆంధ్రప్రదేశ్‌

2020లో దేశవ్యాప్తంగా మొత్తం 1,651 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో తెలంగాణతో పాటు మహారాష్ట్రల్లో అత్యధికంగా 184 చొప్పున కేసులు నమోదయ్యాయి. మూడోస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో వీటి సంఖ్య 171. తెలంగాణలో 2018లో 242, 2019లో 137 కేసులున్నాయి.

2020లో శిక్షలు 1.9 శాతమే

లైంగిక అక్రమ రవాణా కేసుల నిరూపణలో తెలంగాణ పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. 2020లో న్యాయస్థానాల్లో విచారణ జరిగిన 184 కేసుల్లో శిక్షల శాతం 1.9 మాత్రమే. ఈ విషయంలో జాతీయ సగటు 10.3 శాతం కావడం గమనార్హం. తమిళనాడులో అత్యధికంగా శిక్షల శాతం 66.7 కాగా.. మధ్యప్రదేశ్‌లో 25శాతం, ఉత్తరాఖండ్‌లో 20 శాతం, ఝార్ఖండ్‌లో 19.2 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 8.2శాతం నమోదైంది.

తెలంగాణలో..

మొత్తం కేసులు : 184

అరెస్టయిన నిందితులు : 752 మంది

అభియోగాలు దాఖలైన నిందితులు : 684 మంది

విచారణ పూర్తయిన కేసులు : 105

శిక్ష పడిన కేసులు : 2 (1.9శాతం)

కొట్టేసిన కేసులు : 103

విముక్తి పొందిన నిందితులు : 126 మంది

ఇదీ చదవండి : తెలంగాణ : సెల్ఫీ సరదా... రెండు ప్రాణాలు తీసింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.