CI Nageswara Rao Arrest: అత్యాచారం ఆరోపణలతో సస్పెండ్ అయిన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని మారేడ్పల్లి మాజీ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు అరెస్టయ్యారు. రాచకొండ ఎస్వోటీ పోలీసులు నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు. నాగేశ్వరరావు గత రెండేళ్లుగా బాధితురాలిని లైంగికంగా వేధిస్తున్నట్లు ఆధారాలు సేకరించిన పోలీసులు.. సెక్షన్ 452, 376(2), 307, 448, 365 ఐపీసీ, ఆయుధాల చట్టం సెక్షన్ 30 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ జరిగింది.. ఈ నెల 6న వివాహితపై అత్యాచారం చేసి, బాధితురాలితో పాటు ఆమె భర్తను బలవంతంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని ఎల్మినేడుకు కారులో తీసుకెళుతుండగా కారు ప్రమాదానికి గురైంది. కారు నడుపుతున్న నాగేశ్వరరావు భుజానికి గాయం కావడంతో బాధిత దంపతులిద్దరూ తప్పించుకొని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ దురాగతం బయటపడింది.
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సీఐని సస్పెండ్ చేశారు. ప్రమాదంలో గాయపడిన సీఐ తొలుత అజ్ఞాతంలోకి వెళ్లాడు. బాధితులతో మాట్లాడి రాజీ కుదుర్చుకునేందుకు యత్నించాడు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఆయనను పట్టుకొనేందుకు మూడు పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ఈ క్రమంలోనే ఎస్వోటీ పోలీసులు నేడు నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు.
ఇవీ చూడండి.