ETV Bharat / crime

అప్పు ఇచ్చాడు.. తిరిగి ఇస్తే వద్దన్నాడు.. కానీ - ap news

Sexual Harassment : ఇంట్లో అవసరాల కోసం ఓ మహిళ.. ఓ వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నారు. మంచి మనసున్న వ్యక్తి అవసరానికి అప్పు ఇచ్చాడనుకున్నారు. తీసుకున్న నగదు సర్దుబాటు కావడంతో అప్పు ఇచ్చిన వ్యక్తికి తిరిగి ఇవ్వడానికి వెళ్లారు. డబ్బు వద్దన్నాడు.. కానీ తన దుర్బుద్ధిని బయటపెట్టాడు. కోరిక తీర్చాలని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అతని తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలు వాపోయింది.

Harassment
కోరిక తీర్చమని వేధిస్తున్నాడని మహిళ ఆవేదన
author img

By

Published : Oct 3, 2022, 7:18 PM IST

Updated : Oct 6, 2022, 12:20 PM IST

Woman Facing Harassment From Man: వైఎస్​ఆర్​ కడప జిల్లా వేంపల్లికి చెందిన వేంపల్లి నాగమ్మ అవసరాల కోసం సుబ్బరాయుడు అనే వ్యక్తి దగ్గర లక్ష 60 వేల రూపాయలు రెండు సంవత్సరాల క్రితం అప్పు తీసుకున్నారు. నగదు సర్దుబాటు కావడంతో అప్పు తీర్చేందుకు అతని దగ్గరకు వెళ్లారు. తిరిగి అప్పు చెల్లిస్తామంటే.. నాకు డబ్బులు అవసరం లేదన్నాడు.. అదేంటి డబ్బులు తీసుకోండి అంటే... నెమ్మదిగా తన దుర్బుద్దిని బయటపెట్టాడు. తన కోరిక తీర్చాలని వేధించాడని ఆమె వాపోయింది. గతంలో రెండుసార్లు తనను కిడ్నాప్​ చేశాడని.. అంతేకాకుండా తన కుమారుడి తలపై కత్తితో దాడి చేశాడని కన్నీటిపర్యంతమైంది. ఇలా దాడులకు దిగుతూ.. తమ కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆమె ఆరోపించింది.

ఈ కత్తి దాడిలో తలకు తీవ్రగాయమైన తన కుమారుడికి మాట పడిపోయిందని తెలిపింది. అతని తీరుపై పోలీసులకు నాలుగు సార్లు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవటం లేదని.. సుబ్బరాయుడుపై చిన్న కేసు నమోదు చేశారని నాగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. సుబ్బరాయుడు నుంచి రక్షణ కల్పించాలని.. ఆతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 6, 2022, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.