ARREST: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఫిన్‌కేర్ ఫైనాన్స్ సంస్థలో గత నెల 26న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. బ్యాంకు మేనేజర్ స్రవంతితో పాటు ఆమె స్నేహితులు పథకం ప్రకారం దోపిడీ చేసి.. చోరీ జరిగినట్లు నమ్మించారని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. నిందితుల నుంచి రూ.కోటి రూపాయలు విలువగల 1274 గ్రాముల బంగారం, రూ.3.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఖాతాదారుల బంగారు నగలను బయట ఫైనాన్స్ సంస్థలల్లో కుదవ పెట్టి భారీగా నగదు సేకరించినట్లు తెలిపారు. బ్యాంకు అధికారులకు అనుమానం రాకుండా వాటి స్థానంలో నకిలీ బంగారం ఉంచడం వంటి మోసాలకు సైతం పాల్పడినట్లు వెల్లడించారు. బ్యాంకు మేనేజర్ స్రవంతిపై అనుమానం రావడంతో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని.. ఆ సందర్భంలోనే శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన ఆమె స్నేహితులు నవీన్, సుల్తాన్, విజయ్‌కుమార్‌తో పాటు చెన్నైకి చెందిన మహమ్మద్, జగదీష్ కుమార్ ,ఆంటోనీ రాజ్, అరుణ్ ఫిన్‌కేర్ బ్యాంకులో చోరీకి పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని వివరించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
ARREST: బ్యాంకులో దొంగలు పడ్డారని నమ్మించింది.. కానీ దొరికిపోయింది.. ఎలాగంటే..!
ARREST: ఇంట్లో బంగారం ఉంటే రక్షణ ఉండదని కొద్ది మంది, బ్యాంకులో తాకట్టు పెడితే అవసరాలన్న తీరతాయనే ఆలోచనలతో మరికొంత మంది బ్యాంకులను, ఫైనాన్స్ సంస్థలను నమ్మి తాకట్టు పెడతారు. మరి అలాంటి దాంట్లో కూడా రక్షణ లేకపోతే ఎలా? బ్యాంకును కాపాడాల్సిన వారే దానికి కన్నం వేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు తిరుపతి జిల్లాలో కూడా ఇదే జరిగింది. నిజం అనేది ఎక్కువ రోజులు దాగదు.. అబద్ధం అనేది ఎక్కువ రోజులు నిలబడదు అనే దానికి ఇదే ఉదాహరణ.