ETV Bharat / crime

PROTEST: వివాదం 10.30కి.. కానీ కేసు మాత్రం 8 గంటలకే - తిరుపతి జిల్లా తాజా వార్తలు

PROTEST: తమపై దాడిచేసి.. మళ్లీ తమపైనే ఎదురు కేసులు పెట్టారని తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని పెనగడం ఎస్సీ కాలనీ వాసులు మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మేమంతా కలసికట్టుగా శ్రీ గుర్రప్ప స్వామి కొలుపు చేస్తుండగా కొందరు వైకాపా కార్యకర్తలు వచ్చి తామే పూజలు చేయాలని వివాదానికి దిగారు. సంప్రదాయం ప్రకారం ఏళ్లతరబడి చేస్తున్న వ్యక్తులే పూజలు చేయాలని వారికి చెప్పి, వెనక్కి పంపాం. దీనిపై రాత్రి కాలనీలో వివాదం జరిగింది.

PROTEST
PROTEST
author img

By

Published : Jul 6, 2022, 9:54 AM IST

PROTEST: తమపై దాడిచేసి.. మళ్లీ తమపైనే ఎదురు కేసులు పెట్టారని తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని పెనగడం ఎస్సీ కాలనీ వాసులు మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ‘ఆదివారం మేమంతా కలసికట్టుగా శ్రీ గుర్రప్ప స్వామి కొలుపు చేస్తుండగా కొందరు వైకాపా కార్యకర్తలు వచ్చి తామే పూజలు చేయాలని వివాదానికి దిగారు. సంప్రదాయం ప్రకారం ఏళ్లతరబడి చేస్తున్న వ్యక్తులే పూజలు చేయాలని వారికి చెప్పి, వెనక్కి పంపాం. దీనిపై రాత్రి కాలనీలో వివాదం జరిగింది. ఇరువర్గాల వారు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, వైకాపా వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకే కాలనీ వాసులపై కేసు నమోదు చేశారు’ అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 10.30కి వివాదం జరగ్గా ముందస్తుగా 8గంటలకే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని వివరించారు. విచారణ పేరుతో మంగళవారం ఉదయం పోలీసుస్టేషన్‌కి పిలిపించినా.. రాత్రి వరకూ తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదన్నారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీహరి తెలిపారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.