ETV Bharat / crime

అర్చనా నాగ్ సమర్పించు.. "ఊఁ అంటావా లీడర్.. ఊఁ హూ అంటావా?" - ఒడిషా హనీ ట్రాప్

చాలా మంది మగాళ్లు.. వీధుల్లో భారీ విగ్రహాల్లా ఉంటారు. అమ్మాయిల విషయానికి వచ్చే సరికి నిగ్రహం కోల్పోతుంటారు. తుప్పుపట్టిన విగ్రహాల్లా తూలిపోతుంటారు! ఇలాంటోళ్లకు.. ఓ లేడీ స్వయంగా లైన్లోకొచ్చి.. "ఊ అంటావా మావా.. ఊఁ హూఁ అంటావా?" అని అడిగితే ఏమంటారు??

archana nag
archana nag
author img

By

Published : Oct 13, 2022, 5:12 PM IST

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న స్టోరీలోని వారంతా "ఊఁ" అనేశారు! వీళ్లు మామూలోళ్లు కాదు.. భాజపా, కాంగ్రెస్ పార్టీలకు చెందిన బడా నేతలు.. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా! పెద్ద పెద్ద అధికారులు.. పోలీసు ఆఫీసర్లు కూడా ఈ బ్యాచ్​లో ఉన్నారు! పిలవగానే సెంటు కొట్టుకొని మరీ ఎగేసుకు వెళ్లిపోయారు.. జల్సా చేశారు.. కానీ, ఆ తర్వాత అర్థమైంది బతుకు సాలెగూడులో చిక్కుకున్న గుడ్డి ఈగలా మారిపోయిందని! ఇప్పుడు గిల్లా.. గిల్లా.. గిల్లా.. కొట్టేసుకుంటున్నారు..!!

archana nag
అర్చనా నాగ్

ఆమె పేరు అర్చనా నాగ్. పోస్ట్​ కెసింగ, తాలూకా కెసింగ, జిల్లా కలహండి, రాష్ట్రం ఒడిషా. పిన్ కోడ్ 766012. డబ్బు ఎవరికొద్దు? అర్చనకు కూడా కావాలి. అందుకే.. ఉన్నఊరు వదిలేసి, భువనేశ్వర్​కు మకాం మార్చింది. అక్కడ ఓ బ్యూటీ పార్లర్​లో చేరింది. ప్చ్.. ఏం లాభం? ఆంటీగారి సంపాదన కాఫీ టీలకు కూడా సరిపోవట్లే.

ఇప్పుడేం చేద్దాం అన్నాడు భర్త. "వ్యాపారం చేద్దాం". దానికి పెట్టుబడి కావాలిగా? "ఉందిగా!" ఎక్కడ? "దేవుడిచ్చిన అందం.. 36.. 24.. 36 మిస్ యూనివర్స్ దేహసౌష్టవం.. ఇంతకు మించిన పెట్టుబడి ఏముంటుంది?" యూ మీన్ దట్టా..? ఐ థింక్ వాటో వాటు! "ఐ మీన్ దిస్సే.. ఏమంటావ్?" పర్వాలేదంటావా? "మనకు ఈ బాధలు తప్పాలంటే.. తప్పదు నాథ!" సరేలే కానీయ్. అలా.. బెడ్ రూమ్ డోర్ ముందు రిసెప్షనిస్టుగా మారిపోయాడు భర్త జోగ బంధు నాగ్.

archana nag
హనీ ట్రాప్

భర్తే లైసెన్స్ ఇచ్చిన తర్వాత ఇక అడ్డేముంది? బ్యూటీ పార్లర్​లో పని చేస్తూనే.. తన గోడచాటు వ్యాపారం మొదలు పెట్టింది అర్చన. "వ్రతం చెడినా.. ఫలం దక్కాలి కదా" అన్న కాన్సెప్ట్ ప్రకారం.. బెడ్ రూమ్​లోకి ఎవరినిబడితే వాళ్లను కాకుండా.. బాగా బలిసిన బ్యాచ్​నే పిలవాలని భార్యాభర్తలు డిసైడ్ అయ్యారు.

archana nag
హనీ ట్రాప్

స్వయంగా అమ్మాయే వచ్చి.. "ఐ వాంట్ యూ" అంటే.. నో చెప్పే మగాళ్ల పర్సంటేజ్ ఒకటీ రెండుకు మించదు. రాజకీయ నేతల్లో ఈ పర్సెంట్ మరింత హీనం అని భావించారు వారిద్దరూ.. పైగా అడ్డగోలుగా సంపాదించి ఉంటారని వాళ్లనే టార్గెట్ చేశారు. భాజపా, కాంగ్రెస్, బిజూ జనతాదళ్ వంటి రాజకీయ పార్టీల నేతలతోపాటు పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్న అధికారులు.. బాగా బలిసిన పారిశ్రామిక వేత్తలు, చివరకు పోలీసు అధికారులు కూడా అర్చనా ఇంటి కాలింగ్ బెల్ కొట్టడం మొదలు పెట్టారు.

archana nag
అర్చనా నాగ్

వాట్సాప్​లో చాటింగులు.. బెడ్ రూమ్​లో మీటింగులు.. హబ్బో రాస్తే కామసూత్ర 2.0, తీస్తే సీ గ్రేడ్ సినిమా. ఏడేళ్లలో ఎన్నో "రాత్రులు" గడిచిపోయాయి. అందగత్తెతో అందమైన అనుభవం అని ఈ పురుష పుంగవులు ఫీలయ్యేవాళ్లు. కానీ.. అర్చనా మాత్రం ఓ వైపు బెడ్ రూమ్​లో జీవిస్తూనే.. మరోవైపు "బెడ్రూమ్​లో కబడ్డీ" అనే సినిమాకు డైరెక్షన్ కూడా చేసేది! అర్థం కాలేదా..? తన దగ్గరికి వచ్చేవారి పెర్ఫార్మెన్స్​ను HD కెమెరాతో వీడియోలు తీసిపెట్టేది. అలా.. ఒక్కో క్యాండేట్​తో ఒక్కో సినిమా తీసి.. భద్రంగా స్టోర్ చేసేది.

రాత్రి ఆమెను కలిసిన వారికి.. ఆ నెక్స్ట్ డేనే ఫోన్ చేసి.. విషయం చెప్పేసేది. మీ కబడ్డీ సినిమా రీలిజ్ అయితే.. మీ బతుకు ఫుట్ బాల్ అయిపోతుందని భయపెట్టేది. సో.. మీ బేర్ బాడీ సినిమా రిలీజ్ ఆపాలంటే.. ఖర్చవ్వుద్దని చెప్పేది. కుదిరితే కోట్లు అడిగేది.. కొంచెం జాలి చూపించమంటే.. లక్షల్లో బేరం తెగ్గొట్టేది. భర్త జోగ బంధునాగ్.. చిట్టా పద్దులు రాసుకునేవాడు.

archana nag
అర్చనా నాగ్

ఇలా.. ఏడేళ్లలో ఆ కిలేడీ వసూలు చేసిన మొత్తం కొన్ని వందల కోట్ల రూపాయలు! ఆ డబ్బుతో ఏకంగా రెండు కంపెనీలే స్థాపించింది! ఆమె ఇటీవల భువనేశ్వర్‌లోని సత్య విహార్ అనే లగ్జరీ ఏరియాలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేస్తే.. దాన్ని సూర్యనారాయణ పాత్రా అనే ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆమె రేంజ్ ఏంటో చెప్పడానికి ఇది సరిపోదూ..?!

archana nag
అర్చనా నాగ్

కానీ.. తప్పుడు పని ఏదైనా ఎల్లకాలమూ దాచడం సాధ్యం కాదు కదా! దానికి కూడా క్లైమాక్స్ ఉంటుంది. అది తాజాగా ముగిసిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటి వరకూ ఆంటీగారి ఇంటి ముందు ఆగిన కార్ల వివరాలు తెలుసుకుంటే.. పోలీసులకే మతి పోతోందట! అమె దగ్గరున్న ప్రముఖుల వీడియోలు చూసి కళ్లు తేలేస్తున్నారట!!

సొసైటీలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న బ్యాచ్​లో సగం మంది పేర్లు అర్చనా నాగ్ కస్టమర్ల లిస్టులో ఉన్నాయట. దీంతో.. ఇప్పటి వరకూ అర్చనాతో రచ్చ చేసిన వారంతా.. ఎక్కడ తమ పేర్లు బయట పడతాయోనని వణికిపోతున్నారు! ఆమె భర్త జోగ బంధునాగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతను దొరికితే.. మరిన్ని సినిమాలు బయటపడొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరి, ఏం జరుగుతుంది? అన్నది చూడాలి.

వీటిపైనా ఓ క్లిక్కేయండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.