తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్ పరిధిలోని మంచిరేవుల వద్ద ఉన్న ఓ ఫామ్‌హౌజ్‌పై ఎస్వోటీ పోలీసులు ఆదివారం దాడులు(SOT police hyderabad) నిర్వహించారు. పేకాట(Gambling Case in Hyderabad) ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో వెళ్లిన పోలీసులు.. 30 మందిని అదుపులోకి తీసుకున్నాయి. ఇందులో ప్రధాన నిందితుడు సుమన్‌పై గతంలోనూ హైదరాబాద్, బెంగళూర్‌లో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులంతా అదుపులో ఉన్నారన్న పోలీసులు.. ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫామ్‌హౌజ్‌ను ఓ యంగ్ హీరో తండ్రి అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తుండగా ఆ వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఫామ్‌హౌస్ పేకాట కేసులో 30 మందిని అదుపులోకి(SOT police hyderabad) తీసుకున్నారని నార్సింగి సీఐ శివకుమార్ తెలిపారు. ఈ విల్లాను సుమన్ అనే వ్యక్తి ఓ యంగ్ హీరో తండ్రి వద్ద ఒకరోజు అద్దెకు తీసుకున్నారని వెల్లడించారు. సుమన్‌పై హైదరాబాద్, బెంగళూరులో గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయని తెలిపారు. పుట్టినరోజు వేడుకల కోసం అద్దెకు తీసుకున్నారని.. విచారణకు రావాలని ఆ హీరో తండ్రికి నోటీసులు ఇచ్చామని వివరించారు.
నిన్న సాయంత్రం ఏడు గంటల సమయంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మంచిరేవుల విలేజ్‌లోని ఓ విల్లాపై రైడ్ చేశాం. ఎస్వోటీ, ఓ మీడియాతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. అందులో ఒక 30 మంది పేకాట ఆడుతున్న వారిని పట్టుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఆర్గనైజర్ సుమన్ అని... ఇంతకు ముందు కూడా తనని అరెస్ట్ చేసినట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇంకో గంట, రెండు గంటల సమయంలో ఇంకా ఎవరైనా ఇందులో ఉన్నారా? అనేది తెలుస్తుంది. వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు అదుపులో ఉన్న అందరినీ రిమాండ్ పంపిస్తాం. సుమన్ అనే వ్యక్తి... రవీంద్ర ప్రసాద్ దగ్గర ఒకరోజు బర్త్‌డే పార్టీ కోసం తీసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. నాగశౌర్యది అనే ఇన్ఫర్మేషన్ లేదు. రెంటల్ అగ్రిమెంట్ ఇప్పటివరకు రాలేదు. అది వస్తే కన్ఫర్మ్ చేస్తాం. ఇప్పటివరకు ఈ ఫామ్‌హౌస్‌పై ఎలాంటి రికార్డు లేదు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. గేమింగ్‌లో పార్టిసిపేట్ చేసిన అందరూ అదుపులో ఉన్నారు. -శివకుమార్, నార్సింగి సీఐ
ఏం జరిగింది?
గండిపేట మండలం మంచిరేవుల గ్రీన్‌ల్యాండ్స్‌లోని ఓ భవనంలో నడుస్తున్న ఓ పేకాట శిబిరంపై ఆదివారం సైబరాబాద్ పోలీసులు దాడులు(sot police hyderabad) చేసి 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.6.70 లక్షలు, 33 చరవాణులు, 3 కార్లు సీజ్ చేశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు ఆదివారం సాయంత్రం మంచిరేవుల గ్రీన్‌ల్యాండ్స్‌లోని భవనంపై దాడులు చేశారు. ఈ భవనం ఓ యువ హీరోకు చెందినదిగా కలకలం రేగినా, తర్వాత ఆ హీరో తండ్రి సినిమా షూటింగ్ కోసం అద్దెకు తీసుకున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వారికి తెలిసిన ఓ వ్యక్తి పార్టీ చేసుకునేందుకు భవనాన్ని తీసుకున్నట్లు గుర్తించారు. నిందితుల్లో ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది.
బర్త్‌డే వేడుకల కోసం యంగ్ హీరో తండ్రి ఒక రోజుకు సుమన్‌కు ఇచ్చినట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అద్దెకు సంబంధించిన ఒప్పంద పత్రాలు వస్తే పూర్తి సమాచారం తెలుస్తుందని వెల్లడించారు.
ఇదీ చదవండి: ARREST: పేకాట శిబిరంపై ఎస్‌వోటీ దాడులు.. సినీ హీరో అరెస్ట్