ETV Bharat / crime

హత్య చేసి పూడ్చిపెట్టారు.. 14 నెలల తర్వాత పట్టుబడ్డారు..! - ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి శవమయ్యాడు

Bommuluru Murder Mystey: ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు . అతను హత్యకు గురయ్యాడని 14 నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. తన భర్త తిరిగి వస్తాడని ఎదురుచూస్తున్న భార్యకు నిరాశే మిగిలింది. చోరీ చేసిన సొత్తులో వాటా తేడా రావటంతో ..స్నేహితులే చంపేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది . నిందితులను అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. పాతి పెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి డీఎన్​ఏ పరీక్షలకు పోలీసులు పంపారు.

అదృశ్యమైన వ్యక్తి హత్య
Bommuluru Murder Mystey
author img

By

Published : Nov 22, 2022, 9:27 AM IST

14 నెలలుగా అదృశ్యమైన వ్యక్తి హత్యకు గురయ్యాడు..

Nadendla cops solve Bommuluru Murder mystery: ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి శవమయ్యాడు. 14 నెలల క్రితం అదృశ్యమైన వ్యక్తి హత్యకు గురయ్యాడని తేలడటంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చోరీ సొత్తు వాటాల్లో తేడా రావటంతో స్నేహితులే అతన్ని హత్య చేసి పూడ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరు శివారులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్లకు చెందిన జంగం చంటిబాబు.. రాయపాటి వెంకన్న ముఠాతో కలిసి కేరళ. తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల్లోనూ చోరీలకు పాల్పడేవాడు.

చోరీ సొత్తును విక్రయించాలని వెంకన్న చంటిబాబుకు కొంత బంగారం ఇచ్చాడు. బంగారం విక్రయించి నగదు చంటిబాబు స్వంత ఖర్చులకు వినియోగించాడు. తిరిగి ఇమ్మని ఎన్నిసార్లు అడిగినా చంటి లెక్కచేయకపోవటంతో వెంకన్న స్కెచ్ గీశాడు. చంటిబాబును హత్య చేయాలనే పథకంతో తన అనుచరుల ద్వారా విజయవాడ రప్పించాడు. గతేడాది సెప్టెంబర్ 15న విజయవాడలోని ఓ లాడ్జికి స్నేహితులతో కలిసి వచ్చాడు. వాటాలు పంచుకునే విషయంలో చంటిబాబుకు స్నేహితుల మధ్య ఘర్షణ జరిగింది. చంటిబాబు.. కాళ్లు చేతులు తాళ్లతో కట్టి తీవ్రంగా కొట్టారు. కారులో ఎక్కించుకుని తాడుతో గొంతు నొక్కి చంపారని పోలీసులు తెలిపారు.

'సెటిల్ మెంట్ కోసమని స్నేహితులే చంటి బాబును సెప్టెంబర్ 15న సాయంత్రం తీసుకెళ్లారు. చంటిబాబును హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. తమకు రాయపాటి వెంకన్న పై అనుమానం ఉందని పోలీసులకు విన్నవించినా 14 నెలలుగా పట్టించుకోలేదు. ఏడాదికి పైగా మిస్సింగ్ కేసుగానే ఉంచారు.. కనీసం తమ వినతులు కూడా వినలేదు. నిందితుడు వెంకన్న స్థానిక నేతల అండదండలున్నాయి.' - మృతుని భార్య

మృతదేహం త్వరగా కరిగిపోయేందుకు, ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు నూజివీడు వెళ్లి యూరియా కొనుగోలు చేశారు. బొమ్ములూరు శ్మశాన వాటికలో గొయ్యి తీసి యూరియా వేసి.. చంటిబాబు మృతదేహాన్ని పాతి పెట్టారు. సెప్టెంబర్ 16 న చంటిబాబు భార్య నాదెండ్ల పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు . 14 నెలలు గడిచినా పోలీసులు పట్టించుకోలేదు . ఓ కేసులో వెంకన్న అనే నిందితుడ్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తుండగా .. చంటి బాబును హత్య చేసినట్లు తెలిపాడు . దీంతో మిగిలిన నిందితులను అదుపులోకి తీసుకున్న నాదెండ్ల పోలీసులు పాతి పెట్టిన మృతదేహాన్ని వెలికి తీసేందుకు తహసిల్దార్ ,పోలీసు ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నారు.

తహసీల్దార్, నర్సరావుపేట డీఎస్పీ విజయభాస్కర్ ఆధ్వర్యంలో ఓ బృందం బొమ్ములూరుకు చేరుకుంది. శ్మశానవాటికలో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు. చొక్కా, మొలతాడు ఆధారంగా మృతుడు చంటిబాబేనని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. డీఎన్​ఏ పరీక్షల కోసం ఫోరెన్సిక్ బృందం శాంపిల్స్​ను సేకరించిందని డీఎస్పీ తెలిపారు. చోరీకి ముందు రెక్కీ చేస్తారని పోలీసులు తెలిపారు. మొత్తం 8 మంది నిందితులు ఈ హత్యలో పాల్గొన్నారని పోలీసులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.