ETV Bharat / crime

కొవ్వాడలో వ్యక్తి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా? - కొవ్వాడలో దారుణహత్య

murder in west godavari
కొవ్వాడలో దారుణహత్య
author img

By

Published : Apr 3, 2022, 8:06 AM IST

Updated : Apr 3, 2022, 12:24 PM IST

07:50 April 03

నాటు తుపాకీతో కాల్చి చంపిన దుండగుడు

Murder: పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. బుట్టాయగూడెం మండలం కొవ్వాడలో తాటికుంట అనిల్ (28) అనే వ్యక్తిని అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో నాటు తుపాకీతో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలవరం డీఎస్పీ, సిబ్బందితో హత్య జరిగిన ప్రదేశానికి చేరుకొని విచారణ చేపట్టారు.

కొవ్వాడకి పక్కనే ఉన్న రాజానగరం గ్రామానికి చెందిన చలపతి అనే వ్యక్తికి, అనిల్​కు మధ్య వివాదం చెలరేగిందని.. ఈ క్రమంలోనే హత్య జరిగి ఉంటుందని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: రంజాన్‌ నెల ప్రారంభం.. ముస్లింలకు పలువురు శుభాకాంక్షలు

Last Updated : Apr 3, 2022, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.