Mohanakrishna Murder: తిరుపతి జిల్లా చంద్రగిరిలో జూలై 7న జరిగిన మోహనకృష్ణ ఆత్మహత్యకు సంబంధించిన విషయాలను డీఎస్పీ నరసప్ప మీడియాకు వివరించారు. రెడ్డివారిపల్లెకు చెందిన మునిరాజా కుమార్తె మోహన కృష్ణ. తల్లి చనిపోవడంతో అమ్మమ్మ వద్ద ఉంటోంది టైలరింగ్ పనులు చేస్తూ పక్కనే ఉన్న ఆంజనేయపురం గ్రామానికి చెందిన వికాస్‌తో ప్రేమలో పడింది కులాలు వేరు కావడంతో మోహనకృష్ణ కుటుంబ సభ్యులు వారి పెళ్లికి నిరాకరించారు.
అయినా కూడా మోహనకృష్ణ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కుటుంబసభ్యులు గదిలో ఉంచి చిత్రహింసలకు గురిచేశారనీ జూలై 7వ తేది చంద్రగిరిలోని మేనమామ ఇంట్లోని గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుందని ఆత్మహత్యగా చిత్రీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు ఇంటి యజమానులకు భయపడి మృతదేహాన్ని రెడ్డివారిపల్లిలోని అమ్మమ్మ ఇంటికి తరలించారు. అనంతరం తండ్రి మునిరాజా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆత్మహత్య కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎస్వీ మెడికల్ కాలేజ్‌కు తరలించగా.. డిసెంబర్ మొదటి వారంలో ఫలితాలు వచ్చాయి. అందులోని అంశాల ఆధారంగా చేసుకొని పోలీసులు ఆత్మహత్య కేసును హత్య కేసుగా నమోదు చేశారు.
మోహనకృష్ణ వంటిపై గాయాలు ఉండడంతో రిపోర్ట్స్ అలా వచ్చాయని ఆ గాయాలు ఆత్మహత్యకు ముందు తగిలిన గాయాలని డీఎస్పీ నరసప్ప చెప్పారు. మోహనకృష్ణను వేధించడం, మృతదేహాన్ని ఒకచోట నుంచి మరో చోటుకు మార్చడం సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి అంశాలను ఆధారంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. మృతికి సంబంధించి మోహనకృష్ణ బంధువులైన మేనమామలు బాలకృష్ణ, తేజా ప్రసాద్, గిరిప్రసాద్, పెద్దమ్మ కొండమ్మ, అవ్వ బుజ్జమ్మ, అత్త శ్రీలతలను మొత్తం ఎడుగురినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని డీఎస్పీ వివరించారు.
ఇవీ చదవండి: