ETV Bharat / crime

16 మందిని కాపాడిన యువకుడు... నీటిలో శవమై తేలాడు.. అసలేమైంది..? - rushikonda beach

YOUNG MAN DEAD BODY FOUND: ఆ యువకుడు మృత్స్యకార కుటుంబానికి చెందిన గజఈతగాడు. గతంలో సముద్రంలో కొట్టుకుపోయిన 16మందిని కాపాడాడు. అందుకుగాను కేంద్ర యువజన శాఖ నుంచి పురస్కారం అందుకున్నాడు. అయితే నిన్న సముద్రంలో బోట్లు ఢీకొనడంతో ఆ యువకుడు గల్లంతయ్యాడు.

YOUNG MAN DEAD BODY FOUND
YOUNG MAN DEAD BODY FOUND
author img

By

Published : Aug 30, 2022, 7:57 PM IST

DEAD BODY FOUND AT BEACH: విశాఖలోని రుషికొండ బీచ్‌ వద్ద సోమవారం సాయంత్రం సముద్రంలో స్పీడు బోటు ఢీకొని గల్లంతైన మత్స్యకారుడు గణేశ్‌ (26) మృతదేహం లభ్యమైంది. నిన్న సాయంత్రం ప్రమాదం జరిగిన తర్వాత గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.. చీకటి పడటంతో నిలిపివేశారు. అనంతరం ఉదయం నుంచి చేపట్టిన గాలింపు చర్యల్లో నీటి అడుగున ఉన్న గణేష్ మృతదేహాన్ని గజ ఈతగాళ్లు గుర్తించి కుటుంబ సభ్యులకు అందజేశారు. అయితే, శవ పంచనామా విషయమై మెరైన్‌, ఆరిలోవ పోలీసులు స్పందించకపోవడంతో మత్స్యకార కుటుంబాలు గంటల తరబడి ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

గతంలో 16మంది ప్రాణాల్ని కాపాడిన గణేష్‌.. తన సాహసానికి గుర్తింపుగా కేంద్ర యువజన శాఖ నుంచి అవార్డు కూడా పొందారు. సముద్రంలో కొట్టుకుపోతున్న ఎందరినో కాపాడిన యువకుడు.. అదే సముద్రంలో గల్లంతై ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా విచారకరమని స్థానికులంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.