తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా అల్వాల్ మండలం యాప్రాల్ గ్రామానికి చెందిన తల్లి, బిడ్డల మృతదేహాలు గుంటూరు జిల్లా మాచర్ల బుగ్గవాగులో లభ్యమయ్యాయి. చిట్టియర్ రేఖ(32) ఆమె పిల్లలు కనిపించడం లేదని ఈ నెల 24న అల్వాల్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. బుధవారం సాయంత్రం వీరి మృతదేహాలు మాచర్ల సమీపంలోని బుగ్గవాగులో స్థానికులు గుర్తించారు.
రెండు రోజుల కిందటే రెండేళ్ల ధనుష్ మృత దేహాన్ని విజయపురి దక్షిణ పోలీసులు గుర్తించారు. తాజాగా పెద్ద కుమారుడు దేవాన్ష్‌తో పాటు తల్లి రేఖ... వాగులో శవమై తేలారు. మృతదేహాలను బయటకు తీసిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. బంధువులకు సమాచారం ఇచ్చిన మాచర్ల గ్రామీణ పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: