హైదరాబాద్, అంబర్‌పేటలోని మక్రమ్ హోటల్ సమీపంలో.. దుండగులు గుర్తు తెలియని ఓ వ్యక్తిని ముఖంపై బండ రాయితో మోది హత్య చేశారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. మృతదేహం పక్కనే ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉండడంతో.. వివరాలు తెలియడం లేదన్నారు.
ఇదీ చదవండి: కళాశాలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. యువకుడు అరెస్ట్