police Raids on Pub: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని హైదరాబాద్ బంజారాహిల్స్ పబ్‌లో డ్రగ్స్ కలకలంపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో యజమాని అనిల్‌కుమార్, మేనేజర్ అభిషేక్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న అర్జున్ వీరమాచినేని కోసం గాలిస్తున్నారు. ఆగస్టు నుంచి పబ్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పబ్ నిర్వాహకులు ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగిస్తున్నారు.. ఎక్కడ నుంచి మత్తు పదార్థాలను తీసుకొస్తున్నారు.. ఇందుకోసం ఎవరైనా ఏజెంట్లను నియమించుకున్నారా.. అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
5 కొకైన్ ప్యాకెట్లు: పబ్‌పై టాస్క్‌ఫోర్స్ బృందాల దాడి సమయంలో అక్కడ ఉన్న 148 మంది వివరాలు సేకరించామని పోలీసులు తెలిపారు. అందులో 20 మంది పబ్ సిబ్బంది ఉండగా... 90 మంది యువకులు, 38 మంది యువతులు ఉన్నారని వివరించారు. 5 కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్న పోలీసులు... అందరూ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. 90 శాతం మంది మత్తుపదార్థాలు వినియోగించే అవకాశం లేదన్న పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్.. ఎవరిదైనా పాత్ర ఉంటే తప్పకుండా అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.
విస్తుగొలిపే అంశాలు: పోలీసుల దర్యాప్తులో అనేక విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ సరఫరా చేసేందుకు పరిమిత సంఖ్యలో గ్రూప్‌లు తయారు చేసి... ఒక యాప్ సహాయంతో కార్యకలాపాలు కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు. పబ్ యజమానులకు తెలిసిన వారిలో సుమారు రెండు వందల మందిని యాప్‌లో రిజిస్టర్ చేశారు. ఒక్కొక్కరికి ఒక ఓటీపీ కోడ్ ఇస్తారు. డ్రగ్స్ అందుబాటులో ఉన్న సమయంలో ప్రత్యేకమైన వ్యక్తులకు మాత్రమే ఆహ్వానం వెళుతుంది. వారు పబ్‌కు చేరుకుని ఓటీపీ కోడ్ ఎంటర్ చేసి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఠాణాకు సమీపంలో ఉన్న పబ్‌లో ఇంత పకడ్బందీ వ్యవహారం జరుగుతున్నా... నిర్లక్ష్యంగా వ్యవహరించిన బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ శివచంద్రను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సస్పెండ్ చేశారు. ఏసీపీ సుదర్శన్‌కు ఛార్జి మెమో జారీచేశారు. ఏసీపీపై అంతర్గత విచారణ కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.
విదేశీయుల కోసం ఇచ్చిన సౌలభ్యాన్ని హోటల్ నిర్వాహకులు దుర్వినియోగం చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక దృష్టిసారిస్తామని పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు.
ఇవీచూడండి: