ETV Bharat / crime

పరిచయం.. ప్రేమ.. కిడ్నాప్​.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు - Medical student kidnapped in Manneguda

Remand report on Naveen Reddy: తెలంగాణలోని మన్నెగూడ యువతి అపహరణ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో.. కక్ష పెంచుకున్న నవీన్‌రెడ్డి యువతిని అపహరించి వివాహం చేసుకోవాలనుకున్నాడని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు.

naveen reddy remanod report
రిమాండ్ రిపోర్టులో వెలుగులోకి వస్తున్న కీలక అంశాలు
author img

By

Published : Dec 13, 2022, 5:00 PM IST

Remand Report on Naveen Reddy: తెలంగాణలో వైశాలి అపహరణ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటకు వచ్చాయి. గతేడాది బొంగులూరులోని స్పోర్ట్స్ అకాడమీలో యువతితో నవీన్ రెడ్డికి పరిచయమైందని రిమాండ్ రిపోర్ట్​లో తేలింది. ఆమె మొబైల్ నెంబర్ తీసుకొని తరచూ ఫోన్ కాల్స్, మెసేజ్​లు చేసిన నవీన్ రెడ్డి.. పరిచయాన్ని అడ్డుగా పెట్టుకొని బాధిత యువతితో కలిసి ఫోటోలు తీసుకున్నాడని తెలుస్తోంది.

పోలీసుల రిమాండ్ రిపోర్టు ప్రకారం... నవీన్ రెడ్డి పెళ్లి ప్రస్తావన తేవడంతో తల్లిదండ్రులు ఒప్పుకుంటే వివాహం చేసుకుంటానని యువతి చెప్పింది. యువతి తల్లిదండ్రులను ఒప్పించేందుకు ప్రయత్నించిన నవీన్ రెడ్డి. పెళ్లికి అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. యువతి పేరుతో నకిలీ ఇన్​​స్టాగ్రామ్ ఖాతా తెరిచి ఇద్దరూ దిగిన ఫోటోలను వైరల్ చేశాడు. ఐదు నెలల క్రితం యువతి ఇంటి ముందు స్థలాన్ని లీజుకు తీసుకుని తాత్కాలిక షెడ్డు వేసిన నవీన్ రెడ్డి ఆగస్టు 31న గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిమజ్జనం సందర్భంగా న్యూసెన్స్ చేశాడు. వైశాలి ఫిర్యాదుతో నవీన్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 9వ తేదీన యువతికి నిశ్చితార్థం జరుగుతున్నట్లు తెలుసుకున్న నవీన్ రెడ్డి అపహరించి పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నాడు.

దీనికోసం తన అనుచరులతో పాటు మిస్టర్ టీ స్టాళ్లలో పనిచేసే సిబ్బందిని ఉపయోగించుకున్నట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించారు. యువతి ఇంటిపై దాడి అనంతరం ఆమెను అపహరించి వోల్వో కారులో నల్గొండ వైపు తీసుకెళ్లారు. ఫోన్లు స్విచాఫ్ చేసి పెట్టుకున్నారు. పోలీసులు గాలిస్తున్నారని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న నవీన్ రెడ్డి స్నేహితుడు రుమాన్ విషయాన్ని నవీన్ రెడ్డి వద్ద ప్రస్తావించి యువతిని వదిలిపెడదామని చెప్పాడు.

ఈ క్రమంలో నల్గొండ సమీపంలో కారు నుంచి నవీన్ రెడ్డి, అతని ముగ్గురు స్నేహితులు దిగిపోయారు. వోల్వో కారులో యువతిని నవీన్ రెడ్డి స్నేహితుడు రుమాన్ యువతిని హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు 32 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నవీన్ రెడ్డి, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.