DIED: మద్యం మత్తులో నీళ్లు అనుకొని యాసిడ్‌ను కలుపుకొని తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్లలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎర్రవేని మహేష్(29) సింగరేణిలో ఉద్యోగి. గత నెల 18న మద్యం మత్తులో మంచినీరు అనుకొని యాసిడ్ బాటిల్‌లోని యాసిడ్‌ను మద్యంలో కలుపుకుని తాగాడు. దీంతో అపస్మారక స్థితిలోకి చేరాడు. ఇది గుర్తించిన అతడి కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అప్పటి నుంచి చికిత్స పొందుతున్న అతను ఈరోజు మృతి చెందినట్లు హాజీపూర్ ఎస్‌ఐ ఉదయ్‌కుమార్ తెలిపారు. మహేశ్‌కు తండ్రి శంకరయ్య, తల్లి లక్ష్మి, భార్య స్వర్ణలత, కుమారుడు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి.. Old Woman Murder Case: అమ్మలా పిలిచి అన్నం పెడితే.. ప్రాణం తీశాడు