కడప జిల్లా రాజంపేట మండలం కడియవారిపల్లి గ్రామానికి చెందిన మనోహర్, వెంకటేశ్ అనే యువకులు ద్విచక్రవాహనంపై రైల్వేకోడూరు నుంచి చిట్వేలుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో చిట్వేల్ నుంచి రైల్వేకోడూరు వైపు వెళ్తున్న లారీని వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో మనోహర్ మృతి చెందగా... వెంకటేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం వెంకటేశ్‌ను తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.