ETV Bharat / crime

ACCIDENT IN GHAT ROAD: గువ్వల చెరువు ఘాట్ రోడ్‌లో ప్రమాదం.. ఇద్దరు మృతి - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

ACCIDENT IN GHAT ROAD: కడప శివారులోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో లారీ అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్​, క్లీనర్ ఇద్దరు మృతి చెందారు. బెంగుళూరు నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ACCIDENT IN GHAT ROAD
ACCIDENT IN GHAT ROAD
author img

By

Published : Jun 20, 2022, 10:21 AM IST

ACCIDENT IN GHAT ROAD: కడప శివారులోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో లారీ అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్​, క్లీనర్​ ఇద్దరు మృతి చెందారు. పోలీసులు వివరాల మేరకు.. బెంగళూరు నుంచి గుంటూరుకు రొయ్యల దాన బస్తాలు తీసుకెళ్తున్న లారీ రాత్రి 10 గంటలకు గువ్వల చెరువుకు చేరింది. ఘాట్ రోడ్​లోని నాలుగో మలుపు వద్దకు రాగానే.. లారీ అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. దాదాపు వంద అడుగుల లోతులోకి లారీ దూసుకెళ్లడంతో.. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్యాబిన్లో చిక్కుకున్న క్లీనర్​ను అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. లారీ నుంచి అతికష్టం మీద మృతదేహాన్ని పోలీసులు పైకి తీసుకొచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.