ETV Bharat / crime

KSHUDRA POOJALU: వట్టిగుడిపాడులో క్షుద్రపూజల కలకలం

కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడు శివారులో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గ్రామ పొలిమేరలో అర్ధరాత్రి వేళలో గుర్తుతెలియని వ్యక్తులు పూజలు చేస్తుండటం గుర్తించిన గ్రామస్థులు... వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా నలుగురు వ్యక్తులు పరారయ్యారు.

kshudra-poojalu-hulchal-in-vatigudipadu-at-krishna-district
వట్టిగుడిపాడులో క్షుద్రపూజల కలకలం
author img

By

Published : Sep 14, 2021, 2:22 PM IST

కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడు శివారులో ఓ కుటుంబం క్షుద్ర పూజలు చేయించడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపు నలుగురు వ్యక్తులు పారిపోయారు. అందులో క్షుద్రపూజలు చేసే పూజారి ఉన్నట్లు గ్రామస్థులు చెబుున్నారు. విషయం తెలుసుకున్న తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షుద్ర పూజలో ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంచిన కత్తులు, మేకులు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు పోలీసులు గుర్తించారు.

వట్టిగుడిపాడులో క్షుద్రపూజల కలకలం

ఇటీవలే గ్రామ పొలిమేరలో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. కోపం పెంచుకున్న కుటుంబ సభ్యులు.. మరో కుటుంబంపై క్షుద్ర పూజలు చేయించారని గ్రామస్థులు చెబుతున్నారు. గొడవ పెట్టుకున్న ఇరు కుటుంబాలతోపాటు గ్రామస్థులకు కౌన్సిలింగ్ ఇస్తామని... అలాగే గ్రామంలో ఇలాంటివి మరోసారి జరగకుండా చూస్తామని ఎస్​ఐ చంటిబాబు తెలిపారు.

ఇదీ చూడండి: స్వాతంత్య్ర సమరయోధుడు బండారు భోగేశ్వరరావు కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.