ETV Bharat / crime

డబ్బుల కోసం తండ్రిని హతమార్చి.. ఆత్మహత్యగా చిత్రీకరించి - peeleru police latest news

తండ్రిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. డబ్బుల కోసం తండ్రిని హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పోలీసుల తెలిపారు.

Killing father for money
డబ్బుల కోసం తండ్రిని హతమార్చి
author img

By

Published : Mar 17, 2021, 7:49 PM IST

డబ్బుల కోసం తండ్రిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ నెల 12న చిత్తూరు జిల్లా పీలేరు మండలం గొల్లవానికుంటలో తిమ్మయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. డబ్బుల కోసం కుమారుడు చంద్రయ్య తండ్రిని తాడుతో గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎవరికి అనుమానం రాకుండా దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడు. పోలీసుల దర్యాప్తులో నిజాలు బయటకు రావడంతో తానే తండ్రిని హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చదవండి: రెండు రోజుల క్రితం రైతు ఆత్మహత్యాయత్నం... చికిత్స పొందుతూ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.