INHUMAN INCIDENT IN MACHILIPATNAM : మచిలీపట్నంలో ఓ బాలుడి మృతదేహాన్ని బైక్‌పై తరలించాల్సి రావడం అందర్నీ కలచివేసింది. బాలుడి మేనమామ తీవ్రంగా రోదిస్తూ బైక్‌పై మృతదేహాన్ని తరలిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. కృష్ణా జిల్లా గూడూరు ZP హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న నవీన్... ఆదివారం మంగినపూడి బీచ్‌కు వెళ్లాడు. అక్కడ ఈత కొడుతూ సముద్రంలో కొట్టుకుపోయాడు. ఆ తర్వాత పెదపట్నం ఒడ్డుకు కొట్టుకువచ్చిన నవీన్ మృతదేహాన్ని.. బైక్‌పై మార్చురీకి తీసుకెళ్లినట్లు బాలుడి మేనమామ తెలిపారు. బీచ్ నుంచి మృతదేహం తరలించేందుకు అధికారులు స్పందించకపోవడం వల్లే బైక్‌పై తీసుకెళ్లామని చెప్పారు.
ఇవీ చదవండి: