ETV Bharat / crime

ఎన్నికల వేళ భారీగా మద్యం పట్టివేత - కృష్ణా జిల్లాలో అక్రమ మద్యం పట్టివేత

పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు తరలిస్తున్న తెలంగాణాకు చెందిన మద్యాన్ని కృష్ణా జిల్లా ముదినేపల్లి పోలీసులు సీజ్​ చేశారు. ఈ ఘటనలో ఓ టిప్పర్ లారీని, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్​ చేశామని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు

Illegal alcohol confiscation during Panchayati elections in Krishna district
ఎన్నికల వేళ భారిగా అక్రమ మద్యం పట్టివేత
author img

By

Published : Feb 13, 2021, 2:00 PM IST

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండల కేంద్రంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి తరలిస్తున్న తెలంగాణ మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్​ చేసి.. వారి వద్ద నుంచి 2,087 మద్యం బాటిళ్లను, ఓ టిప్పర్ లారీని, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు.

ఓటర్లకు ప్రలోభపెట్టడానికి కొందరు మద్యం పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించామని ఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో ఓ టిప్పర్​ లారీలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సీజ్​ చేసి ఐదుగురిని అరెస్ట్​ చేశామని వివరించారు.

ఇదీ చదవండి: జగన్‌పై కేసు ఉపసంహరణ కోసం పిటిషన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.