Husband killed his wife: ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో నాగులు మీరా అనే వ్యక్తిని జ్యోత్స్న ప్రేమ వివాహం చేసుకుంది. వీరి ప్రేమకు చిహ్నంగా ఇద్దరు పిల్లలు పుట్టారు. కానీ ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు. అతనికి భార్యపై అనుమానం అనే మాయ రోగం సోకింది. అప్పటినుండి భార్యని చిత్రహింసలకు గురి చేయడం మొదలెట్టాడు. ఈ టార్చర్ భరించలేని జ్యోత్స్న తన పుట్టింటికి చేరుకుంది. అలా వెళ్లడం వల్ల.. మరింత అనుమానం పెంచుకున్న నాగుల్ మీరా తరచూ ఇక్కడికి వచ్చి భార్యతో గొడవ పడి వేధించేవాడు.
ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం జ్యోత్స్న తమ్ముడిని కూడా కొట్టడం జరిగింది. అనంతరం జోత్స్న ఫోటోలను మార్పింగ్ చేసి ఆమె వాట్సాప్‌కి పంపించి అలాగే మరి కొంత మందికి పంపించి.. ఈవిడ వ్యభిచారి.. ఈవిడ కావాలంటే ఈ నెంబరుకు కాల్ చేయండి.. అని మెసేజ్‌లు పెట్టడంతో జోత్స్నకి కాల్స్ రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలో సదరు జ్యోత్స్న ముసునూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేయకపోవడంతో.. అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్, డీఎస్పీ కార్యాలయాల.. చుట్టూ తిరిగింది.. కానీ ఫలితం మాత్రం శూన్యం.
గత కొన్ని రోజుల క్రితం నాగుల మీరా రమణక్కపేట గ్రామం రావడంతో.. అతనిని వెంబడించగా అతను ద్విచక్ర వాహనం వదిలి పారిపోవడంతో.. అతని ద్విచక్ర వాహనాన్ని కూడా ముసునూరు పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు సమాచారం. ఈ క్రమంలో ముద్దాయి భార్య జ్యోత్స్నపై మరింత కక్ష పెంచుకొని గురువారం సాయంత్రం భార్యపై దాడి చేసి చంపడం జరిగింది.
అప్పుడే తమ కుమార్తె ఫిర్యాదుపై స్పందించి కేసు నమోదు చేసి అతనిపై చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు నా కుమార్తె నాకు దక్కేదని.. ఇప్పుడు ఆ పిల్లలకు దిక్కు ఎవరని తల్లి రోదన అక్కడ ఉన్న అందరినీ కంటి తడి పెట్టించింది. అయ్యా పోలీసు వారు మీ దృష్టిలో అది ఏ ఫిర్యాదు అయినా సరే వెంటనే మీ సూక్ష్మ దృష్టితో దానిని పరిశీలించి.. బాధితులకు న్యాయం చేయమని గ్రామస్థులు వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి: