Gang rape of an insane minor girl: మతి స్థిమితం సరిగా లేని ఓ మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన తెలంగాణలోని హైదరాబాద్ మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన ఓ మైనర్ బాలిక మతిస్థిమితం సరిగా లేని కారణంగా 3 రోజుల నుంచి కనిపించకుండాపోయింది. ఈ మేరకు కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు వారూ వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే బాలికను తమకు తెలిసిన వారింట్లో గుర్తించారు.
ఆ ఇంటి యజమానిని ఆరా తీయగా.. గత ఆదివారం బాధిత బాలిక తన నివాసానికి వచ్చి సెల్‌ఫోన్ దొంగతనం చేసి వెళ్తుండగా ఆమెను పట్టుకొని తన నివాసంలో నిర్బంధించినట్లు తెలిపాడు. బాలిక పరిస్థితిని చూసిన కుటుంబసభ్యులు అనుమానంతో అతడిని గట్టిగా నిలదీయడంతో తన స్నేహితుడితో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించాడు. దీంతో కుటుంబసభ్యులు వారిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చూడండి..