ETV Bharat / crime

తెరాస ఎమ్మెల్యేలకు ఎర.. డబ్బు కట్టలతో పట్టుబడిన నలుగురు వ్యక్తులు

trs mla
thumbnail
author img

By

Published : Oct 26, 2022, 8:29 PM IST

Updated : Oct 26, 2022, 9:33 PM IST

20:27 October 26

తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో తీవ్ర కలకలం రేగింది. అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించడంతో తీవ్ర అలజడి సృష్టించింది. హైదరాబాద్ శివారులోని ఓ ఫౌంహౌస్‌లో నలుగురు తెరాస ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.

ఆపరేషన్ ఆకర్ష్​లో భాగంగా తెరాస ఎమ్మెల్యేలకు ఎరవేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, తాండూరుఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పార్టీ మారాల్సిందిగా ప్రలోభపెట్టారు. దిల్లీ నుంచి వచ్చిన రామచంద్రభారతితోపాటు తిరుపతికి చెందిన సిహయాజీ స్వామీజీ, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌ సంప్రదింపులు జరుపుతుండగా సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో పోలీసులు దాడిచేశారు.

పార్టీ ఫిరాయించాల్సిందిగా కొందరు తమను సంప్రదించారంటూ తెరాస ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారం మేరకే తాము దాడి చేశామని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డబ్బు, కాంట్రాక్టులతో ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని ఆయన వివరించారు. పదవులు ఎర చూపి పార్టీ ఫిరాయించాలని ప్రలోభపెట్టారని తెరాస ఎమ్మెల్యేలు చెప్పినట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.. ప్రలోభాల ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని సీపీ తెలిపారు.

Last Updated : Oct 26, 2022, 9:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.