Fire Accident: అనంతపురం ఉమానగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆటోమొబైల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాంప్లెక్స్‌లో అన్నీ ఆటోమొబైల్ దుకాణాలు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలార్పారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రజలు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. పక్కనే చిన్నపిల్లల ఆస్పత్రి ఉండటంతో పెషెంట్లను వేరే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున నష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ప్రమాదస్థలాన్ని పరిశీలించారు.
ఇవీ చదవండి: