ETV Bharat / crime

దూకుడు పెంచిన ఈడీ.. చిరుద్యోగుల ఖాతాల్లో భారీ లావాదేవీలు ఎలా?

Delhi liquor scam: దిల్లీ మద్యం ముడుపుల కేసులో ఈడీ అనుసరిస్తున్న వ్యూహం ఆసక్తి కలిగిస్తోంది. ఎవరూ ఊహించని రీతిలో మారుమూల ప్రాంతాలకు చెందిన డ్రైవర్ల వంటివారిని కూడా విచారిస్తుండటం ఉత్కంఠ రేపుతోంది. వారి బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తుండటమే ఇందుకు కారణం.

Delhi liquor scam
దిల్లీ మద్యం ముడుపుల కేసు
author img

By

Published : Oct 24, 2022, 10:29 AM IST

Delhi liquor scam: దిల్లీ మద్యం ముడుపుల కేసులో ఈడీ అనుసరిస్తున్న వ్యూహం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎవరూ ఊహించని రీతిలో మారుమూల ప్రాంతాలకు చెందిన డ్రైవర్ల వంటివారిని కూడా విచారిస్తుండటం, వారి బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తుండటమే ఇందుకు కారణం. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ అరెస్టు చేసిన బోయినపల్లి అభిషేక్‌ ద్వారా రూ.4 కోట్ల వరకూ చేతులు మారినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయిన సంగతి తెలిసిందే. ఈ డబ్బు ఎవరి ఖాతాల నుంచి ఎవరికి అందింది, ఎందుకోసం అందింది అన్నది మాత్రమే నిర్ధారించాల్సి ఉంది.

కాని ఇప్పుడు ఈడీ చాలా ముందుకు వెళ్లింది. చేతులు మారినట్లు చెబుతున్న రూ.4 కోట్ల డబ్బును పక్కనపెట్టి డొల్ల కంపెనీలు, హవాలా వ్యవహారాలు, చిరుద్యోగుల ఖాతాల్లో భారీ లావాదేవీల వంటి అనేక అంశాలపై దృష్టి పెట్టడం ఆసక్తి రేపుతోంది.

నిధుల మళ్లింపుపై కొత్త అంశాలు వెలుగులోకి: దిల్లీ మద్యం పాలసీకి సంబంధించి నమోదైన కేసు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలుగా సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు నిత్యం రాష్ట్రంలో సోదాలు నిర్వహించడంతోపాటు అనుమానితులను విచారిస్తున్నాయి. తీగ లాగితే డొంక కదిలినట్లు మద్యం ముడుపుల కేసు దర్యాప్తు మొదలుపెడితే నిధుల మళ్లింపునకు సంబంధించిన ఇంకా అనేక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

మద్యం ముడుపుల వ్యవహారం పక్కకుపోయి నిధుల మళ్లింపునకు సంబంధించిన కొత్తకొత్త విషయాలు దృష్టికి వచ్చాయి. ఇప్పుడు ఈడీ దర్యాప్తు అంతా దీని చుట్టూనే తిరుగుతోందని, అనేక మంది అనామకుల ఖాతాల ద్వారా పెద్దమొత్తంలో లావాదేవీలు జరిగాయని ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. మహబూబాబాద్‌కు చెందిన ఓ డ్రైవర్‌ ఖాతా నుంచి పెద్దమొత్తంలో వ్యవహారాలు జరగడమే ఇందుకు నిదర్శనం. ఇంకా అనేక మంది మామూలు వ్యక్తులు, చిన్నచిన్న సంస్థల నుంచి కూడా భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరిగినట్లు కూడా ఈడీ దర్యాప్తులో వెల్లడయిందని తెలుస్తోంది. దాంతో ఈ డబ్బు ఎవరిదన్నది తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది.

బ్లాక్‌మనీని చట్టబద్ధం చేసుకునేందుకే: నష్టాల్లో ఉన్న సంస్థలు అకస్మాత్తుగా లాభాల్లోకి రావడం, రూ.వేలల్లో కూడా వేతనాలు లేనివారి ఖాతాల నుంచి రూ.కోట్ల విలువైన లావాదేవీలు జరగడం ఈడీ అనుమానానికి కారణం. సాధారణంగా బ్లాక్‌మనీని చట్టబద్ధం చేసుకునేందుకే ఇలాంటి లావాదేవీలు నిర్వహిస్తారని భావిస్తున్నారు. అందుకే వీటి వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది. అనుమానితుల ఖాతాలను పరిశీలించిన ఈడీ నోటీసులు ఇచ్చి, విచారించి, వారి వాంగ్మూలం నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. వారి ఖాతాల వెనక ఎవరున్నారన్నది వారితోనే చెప్పించడం ద్వారా అసలు వ్యక్తులను గుర్తించాలనేది ఈడీ ఆలోచన.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.