Doctor Suicide in Hyderabad: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ ఠాణా పరిధిలో ఓ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీఐ సైదులు వివరాల ప్రకారం.. కడప జిల్లా బద్వేలుకు చెందిన డా. రాజ్‌కుమార్(29) అమీర్‌పేట శ్యామ్‌కరణ్ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తూ బీకేగూడలో అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. శుక్రవారం స్నేహితుడికి ఫోన్ చేసి తన మనసు బాగాలేదని చెప్పారు. స్నేహితుడు తిరిగి ఫోన్ చేసినా స్పందించలేదు. అనుమానం వచ్చిన అతను మరో వైద్యుడు శ్రీకాంత్‌కు సమాచారమిచ్చారు.
Doctor Suicide News : అతను హుటాహుటిన వచ్చి చూడగా రాజ్‌కుమార్ తన చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకుని అపస్మారక స్థితిలో కనిపించాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి కొండిపల్లి సుబ్బారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. సెలైన్‌లో విషం ఎక్కించుకున్నట్లు గుర్తించారు.
ఇదీ చూడండి: Special Team for Cheddi gang: చెలరేగిపోతున్న చెడ్డీ గ్యాంగ్.. రంగంలోకి ప్రత్యేక బృందాలు