ETV Bharat / crime

CYBER CRIME: పోలీసులకు సవాల్​గా సైబర్​ నేరాలు

రాజస్థాన్‌ భరత్​పూర్... ఈ పేరు మనకు కొత్తేమీ కాదు. ఒక్కప్పుడు దోపిడీ దొంగల అడ్డాగా ఉన్న ఈ ప్రాంతం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల ఫ్యాక్టరీగా మారింది. పలు రాష్ట్రాల పోలీసులకు ఈ భరత్‌పూర్‌ సైబర్ నేరగాళ్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతం దిల్లీ కాల్ సెంటర్ ముఠాలు పోలీసులకు సవాల్‌గా మారాయి. మన సైబర్ క్రైం పోలీసులు వీరిని గుర్తించినప్పటికీ... సొంత రాష్ట్రానికి తీసుకురావడానికి మాత్రం నానా తంటాలు పడాల్సి వస్తోంది.

BHARATPUR CYBER GANG
BHARATPUR CYBER GANG
author img

By

Published : Dec 6, 2021, 8:54 AM IST

పోలీసులకు పెనుసవాల్​గా సైబర్​ నేరాలు.. తేలికగా తప్పించుకుంటున్న నేరస్థులు

cyber crimes: రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్‌ నేరాల్లో నేరస్థులను పట్టుకోవడం పెను సవాల్‌. అత్యాధునిక సాంకేతికతతో పట్టువదలకుండా చేస్తున్న కృషితో తెలంగాణ సైబర్‌ క్రైం పోలీసులు ఈ నేరస్థులను గుర్తిస్తున్నా వారిని పట్టుకుని రాష్ట్రానికి తీసుకురావడం, వారికి శిక్ష పడేలా చేయడం సవాల్‌గా మారింది. వారు ఎక్కడ ఉండి మోసాలకు పాల్పడుతున్నారో తెలుసుకుంటున్నప్పటికీ.. పట్టుకోవడం కష్టంగా మారుతోంది. హైదరాబాద్‌లోని 3 కమిషనరేట్ల పరిధిలో సైబర్‌ నేరాలపై రోజు పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుంటాయి. వీటిలో రాజస్థాన్, నోయిడా, దిల్లీ, యూపీ తదితర ప్రాంతాలకు చెందిన నిందితులు అధికశాతం ఉంటున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు అక్కడ సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని కొద్దిమంది పోలీసులు మాత్రమే మన పోలీసులకు సహకారం అందిస్తున్నారు.

అడ్డగిస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులు

తెలంగాణలో జరిగిన పలు సైబర్‌ నేరాల సూత్రధారులు రాజస్థాన్‌లో ఉన్నారని తెలుసుకున్న పోలీసులు... వారిని పట్టుకునేందుకు అక్కడికి వెళ్లారు. భరత్‌పూర్ చేరకముందే పోలీసులు వచ్చిన విషయం తెలుసుకున్న గ్రామస్థులు వారిని అడ్డగించారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా బెదిరింపులకు దిగారు. నిందితులను గుర్తించేలోపే పోలీసులపై గ్రామస్థులు రాళ్లదాడి ప్రారంభించారు. చాకచక్యంగా బయటపడిన పోలీసులు మరుసటిరోజు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి తీసుకువచ్చేందుకు వెళ్తే అక్కడా అడ్డంకి ఏర్పడింది. ట్రాన్సిట్ వారెంట్ పై ఇక్కడకు తీసుకువచ్చేందుకు అనుమతి కోరగా అక్కడే రిమాండ్ విధిస్తామని న్యాయమూర్తి నుంచి సమాధానం వచ్చింది. స్థానిక పోలీసులు కూడా అటువైపే మొగ్గుచూపారు. ఇలాంటి సమస్యలు తెలంగాణ పోలీసులకు ఎదురవుతున్నాయి. వీళ్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలియగానే స్థానిక ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగి వారిని తప్పించేందుకు అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తున్నారు.

తేలికగా తప్పించుకుంటున్న నేరస్థులు

ఎలాగోలా కష్టపడి వారిని పట్టుకుని రాష్ట్రానికి తీసుకొస్తున్నా రోజుల వ్యవధిలోనే జైలు నుంచి బయటపడుతున్నారు. సైబర్‌ నేరస్థులు అరెస్టయ్యారని తెలియగానే వారిని ఎలా బయటకు తీసుకురావాలనేది న్యాయవాదులు చూసుకుంటారు. లాయర్ల కోసం ఎంత పెద్దమొత్తంలో డబ్బు ఖర్చయినా భరించేందుకు నిందితుల కుటుంబాలు సిద్ధంగా ఉంటాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. సైబరాబాద్ పరిధిలో ఓ కేసులో అరెస్టయిన సైబర్ నేరస్థులు 40 లక్షల వరకూ ఖర్చు చేసేందుకు సిద్ధమంటూ స్థానిక న్యాయవాదిని ఆశ్రయించారు. మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది? మీరు ఎంత కష్టపడి అరెస్ట్ చేసినా తేలికగా బయటకొస్తాం. మీరూ చూసీచూడనట్టు వదిలేస్తే ఎంతైనా ఇస్తామంటూ బహిరంగంగానే చెబుతున్నట్టు సమాచారం. తాజాగా ఒక పోలీసు అధికారికి సైబర్ నేరస్థుడు కేసు లేకుండా చేస్తే 10 లక్షల రూపాయలిస్తానంటూ ఆఫర్ ఇచ్చాడని తెలుస్తోంది. మీ దగ్గర అరెస్టయితే చాలాకాలం జైల్లో ఉండాల్సి వస్తుందని అందుకే ఈ ఆఫర్ ఇచ్చానంటూ.. చెప్పటంతో ఇన్​స్పెక్టర్​ సైతం విస్మయానికి గురైనట్టు సమాచారం.

తెలంగాణ పోలీసులు మాత్రమే..

దేశవ్యాప్తంగా సైబర్ నేరస్థులపై వందల సంఖ్యలో కేసులు నమోదవుతుంటాయి. తెలంగాణ పోలీసులు మాత్రమే ఈ నిందితులను పట్టుకుని, సొమ్ము రికవరీ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఉన్న కేసులను ఒకచోటికి చేర్చుతూ దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

SBI Fake Call Centre: కోట్లు కొల్లగొట్టిన నకిలీ కాల్ సెంటర్లు.. సైబర్ ముఠాల అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.