ETV Bharat / state

పెళ్లి కోసం పంచాయితీ - ఆగ్రహంతో తండ్రిపై కుమారుల దాడి

కన్న తండ్రిపై కక్ష పెంచుకున్న కుమారులు

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2024, 9:44 AM IST

Sons Attack on His Father in Kurnool District : కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని, పెళ్లీడు వచ్చినా వివాహాలు చేయడం లేదన్న కారణాలతో కన్న తండ్రిపై కక్ష పెంచుకున్న కుమారులు ఆయనపై దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లా గోనెగండ్లలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నేసే మంతరాజు, ఆదిలక్ష్మి దంపతులు కిరాణ దుకాణం నిర్వహిస్తూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తెకు వివాహం చేశారు. మిగిలిన ముగ్గురికి కాలేదు.

పట్టపగలు తీసుకెళ్లి చీకటి పడేదాకా కొట్టారు - యువకుడిపై నలుగురి దాడి

పిల్లల వివాహాలను పట్టించుకోవడం లేదని ఇద్దరు కుమారులు కులపెద్దలతో పలుమార్లు పంచాయితీ పెట్టించారు. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన పెద్దల పంచాయితీలో ఉద్రేకానికి గురైన ఇద్దరు కొడుకులు ఉదయం ఇంట్లో తండ్రి మంతరాజుపై దాడి చేయడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నచ్చజెప్పారు. పోలీసులు మంతరాజును చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై గోనెగండ్ల సీఐ గంగాధర్‌ మాట్లాడుతూ గొడవ జరిగిన విషయం వాస్తమేనన్నారు. బాధితుడు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు.

నన్నే పక్కకు తప్పుకోమంటావా! - ఆర్టీసీ మహిళా కండక్టర్, డ్రైవర్‌పై మందుబాబు దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.