హైదరాబాద్ బాలానగర్ పరిధిలో క్రెడిట్ కార్డ్ వివరాలు అప్డేట్ చేస్తామని ఓ మహిళను నమ్మించిన సైబర్ కేటుగాడు ఆమె ఖాతా నుంచి రూ.2లక్షలు కాజేశాడు. బాలానగర్‌కు చెందిన సమీనా ఓ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. గత నెల 30న క్రెడిట్ కార్డు వివరాలు అప్డేట్ చేసుకోవాలని కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్‌లో సర్చ్ చేసింది. ఓ నెంబర్‌కు తన క్రెడిట్ కార్డు అప్డేట్ చేయాలని రిక్వెస్ట్ పంపింది.
రిక్వెస్ట్ పంపిన అరగంటలో కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి సమీనాకు ఫోన్ చేసి తన కార్డు వివరాలు, ఓటీపీ అడిగాడు. వివరాలు చెప్పిన వెంటనే తన ఖాతా నుంచి రూ.2లక్షలు మాయమవ్వడం గమనించిన సమీనా మళ్లీ ఆ నెంబర్‌కు ఫోన్ చేసింది. స్విచ్ఛాఫ్ రావడం వల్ల మోసపోయానని గ్రహించి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న బాలానగర్ పోలీసులు.. సైబర్ కేటుగాళ్లు రోజుకో పంథాలో మోసాలకు పాల్పడుతున్నారని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- ఇదీ చదవండి: తిరుమలలో అగ్నిప్రమాదం... ఆరు దుకాణాలు దగ్ధం