ETV Bharat / crime

cyber cheaters: సాఫ్ట్​వేర్​ ఉద్యోగినైనా.. సీఐ భార్యనైనా.. దర్జాగా దోచేస్తున్నారు! - cyber cheaters

మీ ఫోన్‌కి ఏదైనా లింక్‌ వచ్చిందా...? పోనీ, డబ్బులు పంపించాలంటూ ఎవరైనా QR కోడ్‌ పంపించారా...? లేదా ఆన్‌లైన్‌ ఫిర్యాదుల కోసం గూగుల్‌లో కస్టమర్‌ కేర్‌ నంబర్‌ శోధిస్తున్నారా...? అయితే... కాస్త అప్రమత్తంగా ఉండండి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. మీ ఖాతాలో సొమ్ము స్వాహా అయినట్లే...! అవును... సైబర్‌ మోసాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి.

CYBER CRIME
CYBER CRIME
author img

By

Published : Jun 18, 2021, 7:16 AM IST

సైబర్‌ నేరస్థుల ఆగడాలకు ‌అడ్డుకట్ట లేకుండా పోతోంది. వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు ఎవ్వరినీ వదలని కేటుగాళ్లు.. పోలీసులకు సైతం చుక్కలు చూపిస్తున్నారు. హైదరాబాద్ నారాయణగూడ సీఐ సతీమణికీ.. సుమారు లక్ష రూపాయలు టోకరా వేశారు. ఆన్‌లైన్‌లో 500 రూపాయలు విలువ చేసే చీరను.. సీఐ సతీమణి ఆర్డర్‌ చేశారు. తీరా వచ్చిన పార్శిల్‌లో చీర లేకపోవటంతో.. గూగుల్‌లో వెతికి సంబంధింత సంస్థ కస్టమర్ కేర్ నంబరు తెలుసుకొని ఫోన్ చేశారు. ప్యాకింగ్‌లో పొరపాటు జరిగిందన్న అవతలి వ్యక్తి.. డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పి.. బ్యాంక్ ఖాతా నంబరు తెలుసుకొని క్యూఆర్​ కోడ్ పంపించాడు. ఆ లింక్‌పై క్లిక్‌ చేయగానే.. 45 వేలు మాయమయ్యాయి. ఇదేంటని అడిగితే పొరపాటు జరిగిందంటూ.. మరో కోడ్ పంపించాడు. ఇలా మూడు దఫాలుగా ఆమె ఖాతా నుంచి 59 వేలు కొట్టేశాడు.

హైదరాబాద్‌ ముషీరాబాద్‌కు చెందిన ఓ టీసీఎస్​ ఉద్యోగి నుంచి సైబర్‌ నేరగాళ్లు సుమారు 4 లక్షలు కాజేశారు. ఓ ప్రముఖ సంస్థ పేజీ తెరుచుకునేలా ఆమె చరవాణికి లింక్‌ పంపించారు. ఆ యువతికి ఫోన్‌ చేసి షేర్ మార్కెట్ ట్రెండింగ్‌లో ఉన్నందున..పెట్టుబడి పెడితే నాలుగు రెట్లు వస్తోందని నమ్మించారు. నాలుగు లక్షలు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయగానే సొమ్ము మెుత్తం స్వాహా చేశారు. మరో కేసులో బజాజ్ ఫైనాన్స్ ద్వారా రుణం ఇప్పిస్తామని చెప్పి.. తాడ్‌బంద్‌కు చెందిన అనిల్ కుమార్ నుంచి బ్యాంకు వివరాలు సేకరించిన సైబర్‌ నేరగాళ్లు.. 9 లక్షల 44 వేలు నొక్కేశారు.

మరో కేసులో తార్నాకకు చెందిన గంగాధర్‌ రెడ్డి అనే వ్యాపారి నుంచి మెటీరియల్‌ కొనుగోలు పేరుతో 2 లక్షల 70 వేలు దోచుకున్నారు. అంతేకాదు.. అమెరికాలో ఉండే స్నేహితుడి ఫోటో వాట్సాప్ DPగా పెట్టి.. హైదరాబాద్‌లో ఉండే వ్యక్తిని ట్రాప్‌ చేశారు. అత్యవసరంగా రెండు లక్షలు కావాలని చెప్పి మోసం చేశారు. ఇలా వివిధ రకాలుగా ఆన్‌లైన్‌ నేరగాళ్లు.. మోసాలకు పాల్పడుతుండటంతో.. సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదుల సంఖ్య పెరుగుతోంది.

సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్న పోలీసులు.. ప్రజలు మోసపోకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: 'మూడో దశ ప్రభావం పిల్లలపై ఉండదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.