ETV Bharat / crime

AP CRIME NEWS: దిండుతో భార్యను హతమార్చిన భర్త.. కారణమిదే..

సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. చిన్న చిన్న కారణాలతోనే ఒకరిపై మరొకరు దాడులకు దిగుతున్నారు. కొందరైతే హత్యలు చేయడానికీ వెనుకాడట్లేదు. కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను కడతేర్చిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరగ్గా.. గుంటూరు జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను దారుణంగా హతమార్చారు.

author img

By

Published : Mar 2, 2022, 10:36 AM IST

ap crime news
ap crime news

కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను కడతేర్చిన ఘటన శ్రీకాకుళం గ్రామీణ మండలం సానివాడలో చోటు చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘటన.. స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. విశాఖపట్నానికి చెందిన కల్యాణితో ఆరున్నర ఏళ్ల కిందట పొన్నాడ నవీన్ కుమార్ వివాహం జరిగింది. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. మంగళవారం రాత్రి కూడా మరోసారి ఘర్షణ జరిగింది. ఆ సమయంలో క్షణికావేశానికి లోనైన నవీన్ కుమార్.. నిద్రపోతున్న కల్యాణిపై తలగడను పెట్టి ఊపిరి ఆడకుండా చేసి.. హత్య చేశాడు. అనంతరం శ్రీకాకుళం గ్రామీణ పోలీసు స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు.

మహిళ దారుణ హత్య..

గుంటూరు జిల్లా బాపట్లలోని పెయింటర్స్ కాలనీకి చెందిన గుడపాటి భారతి దారుణ హత్యకు గురైంది. ఆమె గత నెల 16వ తేదీ నుంచి కనిపించకుండాపోయింది. దీనిపై కుటుంబ సభ్యులు బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. హత్య కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

దంపతులపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..

కృష్ణా జిల్లా చాట్రాయి మండలంల చిత్తపూరు చెరువు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు దంపతులపై దాడికి దిగారు. స్ప్రే చల్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆ దంపతులను అటుగా వెళుతున్న కొందరు వ్యక్తులు నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యే కుమారుడికి రోడ్డుప్రమాదం..

తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం ఎదురులంక జాతీయ రహదారి 216పై ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి కాకినాడ నుంచి అమలాపురం వస్తున్న కారు రోడ్డు ప్రక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీ కొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు.. వారిని ముమ్మడివరం శాసనసభ్యుడు పొన్నాడ సతీష్ కుమారుడు, మేనల్లుడుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వారిని కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించారు. కుమారుడికి స్వల్ప గాయాలు కాగా మేనల్లుడు పరిస్థితి విషమంగా ఉంది.

గ్యాస్ సిలిండర్ లీక్​తో అగ్నిప్రమాదం..

కర్నూలు జిల్లాలో సిలిండర్ లీకై భారీ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆదోని మండలం చిన్నగొనేహల్లో హనుమంతు ఇంట్లో గ్యాస్ సిలెండర్ లీకై అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుడిసెతో పాటు ఇంట్లో విలువైన వస్తువులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఇటీవలే మిరప పంట అమ్మి, వచ్చిన నగదును 3లక్షల 50 వేల నగదు ఇంట్లో కాలి బూడిదైందని రైతు హనుమంతు వాపోయారు. ఐదు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక అధికారి తెలిపారు.

కారు నుంచి మంటలు..

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ప్రయాణిస్తున్న కారు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎల్ఐసీలో పని చేస్తున్న నాంచారయ్య కారులో వెళుతుండగా ఎస్పీ క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శంకర్రావు మంటలను గమనించి.. అగ్ని మాపక సిబ్బందికి సమాచారమిచ్చారు.

బస్సు, ఆటో ఢీ.. ఆరేళ్ల బాలుడు మృతి

కర్నూలు జిల్లా బ్రాహ్మణ కొట్కూరు పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. కర్నూలు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు శ్రీశైలం నుంచి కర్నూల్ వెళుతూ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా దెబ్బతిన్నది. బాలుడు పునీత్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా... ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. బ్రాహ్మణ కొట్కూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కారు పల్టీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు..

కృష్ణాజిల్లా కంచికచర్ల చెరువుకట్ట సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రహదారి ప్రక్కన కాలవలో పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో పదిమంది ప్రయాణిస్తున్నారు. ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.

ఇదీ చదవండి:

attack: ఓ కార్ వాషింగ్ షాపు యజమానిపై వైకాపా నేత, అతని అనుచరుల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.